mt_logo

బీజేపీ నుండి రాజాసింగ్ సస్పెండ్

మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ను పార్టీనుంచి స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు బీజేపీ మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది. పార్టీ విధానాల‌కు వ్య‌తిరేకంగా మాట్లాడినందుకు ఈ చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపింది. సెప్టెంబ‌ర్ 2లోగా వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఎమ్మెల్యే రాజాసింగ్‌ను హైక‌మాండ్ ఆదేశించింది. కాగా మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై రాజాసింగ్ చేసిన వ్యాఖ్య‌లు దేశ‌వ్యాప్తంగా వివాదం రేగింది. రాజాసింగ్ అనుచిత వ్యాఖ్యలపై జాతీయ మీడియాలో తీవ్ర చర్చలు నడుస్తున్నాయి. ఈ వివాదం మరో నుపుర్ శర్మ వివాదం కాకముందే బీజేపీ దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టింది. మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన రాజాసింగ్ ను ఆగ్ర‌హంతో బీజేపీ స‌స్పెన్ష‌న్ వేటు వేసి, ఎందుకు బ‌హిష్క‌రించ‌కూడ‌దో పది రోజుల్లో వివ‌ర‌ణ ఇవ్వాల‌ని రాజాసింగ్‌ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నగరంలో ప్రముఖ కమెడియన్‌ మునావర్‌ ఫారూకి షో సంద‌ర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఓ వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఈ వీడియోలో మహమ్మద్‌ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఓ వర్గం ఆరోపిస్తూ… రాజాసింగ్ కు వ్యతిరేకంగా నిరసనలు మొదలు పెట్టారు. నగర పరిధిలోని పలు స్టేషన్లలో ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు ఈరోజు ఉదయం అరెస్టు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *