mt_logo

పార్టీలకు అతీతంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని కొర్రెములలో 720 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పంపిణీ చేశారు. పేదల సొంత ఇంటి కలను నెరవేర్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఉచితంగా ఇచ్చిన దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. 10 వేల కోట్ల రూపాయల వ్యయంతో జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం జరిగిందని తెలిపారు. సొంత ఇంటి కల నెరవేరడంతో పలువురు లబ్ధిదారులు భావోద్వేగానికి లోనయ్యారు.