mt_logo

జూన్ 7న ములుగు పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్  

ఈ నెల 7 తారీఖున మంత్రి కేటీఆర్ ములుగు జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి 65 కోట్ల నిధులతో నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.  ఈ సందర్భంగా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లు మీడియా తో మాట్లాడుతూ.. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కేంద్రంలోని పలు కార్య క్రమాలకు అభివృద్ధి పనుల చేయనున్నారని వివరించారు.కేటీఆర్ పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి 65 కోట్ల నిధులతో నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని తెలిపారు.ఒక కోటి రూపాయలతో మేడారం శాశ్వత ప్రాతిపదికన 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారని తెలిపారు. ములుగు జిల్లా కేంద్రంలో 30 లక్షల నిధులతో గ్రంథాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపనలు చేయనున్నారని తెలిపారు అంతర్గత సీసీ రోడ్లు నిర్మాణాలకు ప్రారంభోత్సవం చేనున్నారని తెలిపారు.

మహిళలకు వడ్డీ లేని రుణాలు చెక్కుల పంపిణీ

రామప్పలో అదే రోజు ఇరిగేషన్ డే గోదావరి జలాలకు పూజలు చేయనున్నారని తెలిపారు. రామప్ప రిజర్వాయర్ పూర్తయిన నేపద్యంలో ఇరిగేషన్ చెరువుల ఉత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.  సీఎం సూచన మేరకు ఢిల్లీకి పలుసార్లు మేము వెళ్ళామని యునెస్కో గుర్తింపుకు కేటీ రామారావు ఎంతో కృషి చేశారని వారు అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని సాధన హై స్కూల్ పక్కన ప్రాంగణంలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు సుమారు పదివేల మందిని తరలించేందుకు అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయం పని చేసుకోవాలని సూచించారు. బహిరంగ సభ కార్యక్రమంలో ఐకేపి మహిళలకు వడ్డీ లేని రుణాలు చెక్కుల పంపిణీ చేయనున్నట్లు అదే విధంగా గొల్ల కురుమలకు రెండో విడత గొర్రెల పంపిణీ 125 యూనిట్లు పంపిణీ చేయనున్నారని తెలిపారు.

కేటీఆర్ పర్యటన నేపథ్యంలో జడ్పీ చైర్మన్ పార్లమెంట్ సభ్యులు జిల్లా అధికార ప్రజాప్రతినిధులు బహిరంగ సభ విజయవంతానికి పూర్తిస్థాయిలో కృషి చేయాలని ఆమె కోరారు.ములుగు నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ డయాలసిస్ సెంటర్ ఇప్పటికే మంజూరు చేసిన విషయాన్ని వారు గుర్తు చేశారు.ఎండాకాలం కాబట్టి 10 గంటల లోపు ప్రజలను తరలించే విధంగా అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు.

సభ స్థలానికి 10 గంటల వరకు మీటింగ్ ఏర్పాటు చేసి విధంగా గ్రామ కార్యదర్శిలతో సమన్వయం చేసుకోవాలని డిపిఓ కు సూచించారు. ఐదు యూనిట్లు 5000 మందికి తరలించడానికి బ్యాంకు లింకేజీ శ్రీనిధి సీఎస్ సమైక్య నాయకులను మహిళలను సభా స్థలికి చేరుకునే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు.షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులను మాట్లాడే విధంగా సంసిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కులవృత్తుల విశ్వబ్రాహ్మణులు వృత్తిపై ఆధారపడ్డ వడ్ల కమ్మరి వారికి లక్ష రూపాయల ఆర్థిక సాయం రాష్ట్ర ప్రభుత్వం చేయనున్నట్లు వివరించారు.మన రాష్ట్రానికి ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో పెట్టుబడులు వస్తున్నాయని కేటీ రామారావు మా తెలంగాణకు ఎన్నో ఐటీ కంపెనీలు తెస్తున్నారని వారు వివరించారు.