టీవీ9 మెగా కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా సునీల్ కనుగోలు గురించి మాట్లాడుతూ.. కనుగోలో కొనుగోలో వచ్చారు కదా.. యూట్యూబ్‌ను, కొంత మంది యూట్యూబర్‌లను కనుగోలు కొనుగోలు చేసారు. కొనుగోలు చేసి ఏదో జరిగిపోతుందని భ్రమ కల్పించడం లాంటివి చేస్తున్నారని ఎద్దేవా చేసారు.
మీరు డిసెంబర్ 3 నాడు చూడండి.. డబ్బాలు తెరిచాక.. ఇదంతా బిల్డప్ ఇదంతా.. గాలి బుడగ అని తేలక పోతే నన్ను అడగండి కేటీఆర్ అన్నారు. లాస్ట్ టైం కూడా బిగ్ బ్రేకింగ్.. అయిపోయింది.. అయిపోయిందని అన్నారు, 500 కోట్లు తెచ్చారు, ఉత్తమ్ కుమార్ ఇగ గడ్డం తీసేదే మిగిలింది.. అయిపోయింది గెలిచిపోయారు, ముఖ్యమంత్రి అయ్యారు అని అన్నారు అని గుర్తు చేసారు.
ఒకాయనేమో గడ్డం తీసుకోనున్నారు. ఒకాయన సన్యాసం అన్నాడు, వాళ్ళే మళ్ళీ పోటీ చేస్తున్నారు. వీళ్ళ మాటలకు విలువ ఎక్కడుంది, వీళ్ళకు వెలువెక్కడుంది అన్నారు.