హైదరాబాద్, జూన్ 12: ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ గారి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో మంత్రులు కేటీఆర్ గారు, పువ్వాడ అజయ్ కుమార్ గారు ములుగుకు బయలుదేరారు. హెలికాప్టర్‌లో మంత్రులతో పాటు ఎంపీలు సంతోష్ కుమార్ గారు, రంజిత్ రెడ్డి గారు, ఎమ్మెల్యే బాల్క సుమన్ గారు ఉన్నారు.