mt_logo

మంత్రి కేటీఆర్ కి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆహ్వానం

-ఆగస్టు 11వ తేదీన మొహాలీలో ఈ మేరకు మంత్రి కే తారకరామారావు ఐ ఎస్ బి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడనున్నారు.

తెలంగాణ పురపాలక మరియు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కే. తారక రామారావు కి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆహ్వానాన్ని అందించింది. ఐ ఎస్ బి ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం ఇన్ పబ్లిక్ పాలసీ ఎనిమిదవ బ్యాచ్ ను ప్రారంభించాల్సిందిగా ఐ ఎస్ బి మంత్రి కేటీఆర్ ని కోరింది. ఆగస్ట్ 11వ తేదీన మొహాలీలో ఈ మేరకు మంత్రి కే తారకరామారావు ఐ ఎస్ బి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడనున్నారు. 

తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన నుంచి ఐ ఎస్ బి కి ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అందిస్తున్న మంత్రి కేటీఆర్ తన అనుభవాలను తమ విద్యార్థులతో పంచుకోవడం అమూల్యమైన అంశమని, మంత్రి కేటీఆర్ ప్రసంగం గురించి ఉత్సాహంతో ఎదురుచూస్తున్నామని ఐ ఎస్ బి బీన్ మదన్ పిల్లుట్ల తెలిపారు. 

తమ సంస్థ పబ్లిక్ పాలసీ కోర్సులో భాగంగా ప్రవేశాలు పొందిన వారికి మంత్రి కేటీఆర్ తన పరిపాలన అనుభవాలను పంచుకోవడం వలన తమ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మదన్ పిళ్లుట్ల తెలిపారు. మంత్రి కేటీఆర్ ఆలోచనలు, అభిప్రాయల ద్వారా పబ్లిక్ పాలసీ యొక్క లక్ష్యాలను, పబ్లిక్ పాలసీని రూపొందించే ప్రక్రియ వంటి అంశాల పైన సమగ్రమైన అవగాహన తమ విద్యార్థులకు అందుతున్న అందుతున్నదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.