mt_logo

దేశంలో ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి తెలంగాణలో జరిగింది: మంత్రి కేటీఆర్‌

రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్‌ భూపాలపల్లి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో నిర్మించిన సమీకృత కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..  

ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెట్టిన జిల్లా కలెక్టర్ కార్యాలయంను నేను ప్రారంభించడం నా అదృష్టం అన్నారు.ఇతర రాష్ట్రాల నుండి అధికారులు ఇక్కడికి వచ్చినప్పుడు.. మన జిల్లా కలెక్టరేట్‌లు, జిల్లా పోలీసు కార్యాలయాలు చూసి వేరే రాష్ట్రాల్లో సచివాలయాలు కానీ, డీజీపీ కార్యాలయాలు కానీ ఇంత గొప్పగా ఉండవు అని వాళ్ళు చెప్తుంటారని అన్నారు. వేరే రాష్ట్రాల సెక్రటేరియట్ కంటే గొప్పగా జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయంలో ఉన్నాయన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి తెలంగాణలో జరిగిందని తెలిపారు. భౌగోళికంగా 11వది జనాభా  పరంగా 12 వది,  దేశంలో 4వ స్థానంలో తెలంగాణ ఉందని గుర్తు చేశారు.

ఫర్ క్యాపిటల్ ఇన్‌కంలో 1వ స్థానంలో తెలంగాణ ఉంది.ఐటీ, వ్యవసాయ ఉత్పత్తుల లో తెలంగాణ అగ్రగామిగా ఉందన్నారు.  పరిశ్రమలు పర్యావరణంలో తెలంగాణ అగ్రగామి, ఒకవైపు అభివృద్ధి, మరో వైపు సంక్షేమం, దేశంలో ఎప్పుడు అవార్డులు వచ్చిన తెలంగాణ మొదటి 10 స్థానంలో ఉంటుంది. 2014 కంటే ఈ రోజు వరకు జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు ఆశీర్వదిస్తారని పేర్కొన్నారు.