mt_logo

వృద్ధులకు భరోసా కల్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వం

సిరిసిల్ల, జూన్ 14: నేడు రాజన్న సిరిసిల్లలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. అందులో భాగంగానే సిరిసిల్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు బుధవారం తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అక్కడినుండి బయల్దేరి వృద్ధులకు భరోసా ఇస్తూ అరవై ఏండ్లు పైబడి, తమకంటూ ఎవరూ లేని వృద్ధులకు ఆశ్రయం కల్పించేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్లపల్లి మండలం, మండేపల్లి శివారులో సకల వసతులతో నిర్మించిన ప్రభుత్వ వయో వృద్ధుల ఆశ్రమాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం అక్కడ ఉన్న వృద్ధులతో ముచ్చటించారు.