mt_logo

సిరిసిల్లలో భూగర్భ జలాల పెరుగుదల దేశానికి పాఠం: మంత్రి కేటీఆర్

సిరిసిల్లలో భూగర్భ జలాల పెరుగుదల దేశానికి పాఠమన్నారు మంత్రి కేటీఆర్. సిరిసిల్ల విజయ శంఖారావంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..  9 ఏళ్ల పాలనలో ప్రతి ఎకరాకు నీరు అందించాం అని తెలిపారు. సిరిసిల్లను జిల్లాను చేసి చూపించాం అన్నారు. 9 ఏళ్ల సిరిసిల్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలు మన బీళ్ళకు పారుతున్నాయన్నారు. ఎండకాలంలో కూడా అప్పర్‌ మానేరు మత్తడి దూకుతోందని స్పష్టం చేసారు. మనది చేతల ప్రభుత్వం.. చేనేతల ప్రభుత్వం అని పేర్కొన్నారు. 

రాష్ట్రంలోనే  మొదటి కేజీ టూ పీజీ క్యాంపస్ మన గంభీరావుపేటకు వచ్చిందన్నారు. సిరిసిల్లలో భూగర్భ జలాల పెరుగుదల దేశానికి పాఠమైందని చెప్పారు. సిరిసిల్ల ప్రజలు మళ్లీ ఆశీర్వదిస్తారని ధీమా వ్యక్తం చేశారు. సిరిసిల్లకు మెడికల్, ఇంజినీరింగ్‌ కాలేజ్‌ ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది అని తెలిపారు. సీఎం కేసీఆర్ పాలనలో సిరిసిల్ల సిరుల జిల్లాగా మారిందన్నారు. హ్యాట్రిక్‌ సీఎంగా కేసీఆర్ రికార్డ్ సృష్టిస్తారని పేర్కొన్నారు.