mt_logo

లక్ష మట్టి వినాయక విగ్రహాల ఉచిత పంపిణీని ప్రారంభించిన మంత్రి కేటీఆర్   

  • 2017 నుంచి మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్న హెచ్ఎండిఏ 
  • పర్యావరణ హితం కోసం హెచ్ఎండిఏ ప్రయత్నం 
  • ఈసారి 40 కేంద్రాల్లో లక్ష విగ్రహాల పంపిణీ  

హైదరాబాద్: పర్యావరణ హితం కోసం గత ఆరు సంవత్సరాలుగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) తన వంతు బాధ్యతను నిర్వహిస్తున్నది. ప్రతి ఏటా లక్ష మట్టి వినాయక ప్రతిమలను హెచ్ఎండీఏ ఉచితంగా ప్రజానీకానికి పంపిణీ చేస్తున్నది. ఏడాది లక్ష వినాయక మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం ఉదయం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, మంత్రి గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బి.వినోద్ కుమార్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజులతో కలిసి ప్రారంభించారు.  

తెలంగాణ సచివాలయంలో ఎంఏయుడి స్పెషల్ సీఎస్, హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ అర్వింద్ కుమార్ ఆధ్వర్యంలో హెచ్ఎండిఏ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారికి వినాయక మట్టి ప్రతిమను అందజేశారు. గురువారం 14వ తేదీ నుంచి వరుసగా నాలుగు రోజులపాటు 24వ తేదీ నుంచి 17వ తేదీ  వరకు జంట నగరాలలోని 40 కేంద్రాలలో హెచ్ఎండీఏ వినాయక మట్టి ప్రతిమలను హెచ్ఎండీఏ యంత్రాంగం పంపిణీ చేస్తుంది.