mt_logo

నేతన్నల కోసం 25 వేల రూపాయల చేనేత హెల్త్ కార్డును ప్రకటించిన మంత్రి కేటీఆర్

  • ఫ్రేమ్ మగ్గాలు ఏర్పాటు కోసం  40.50 కోట్లు
  • పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ 12.60 కోట్లతో పునరుద్ధరణ

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నల రాష్ట్రస్థాయి సంబరాల్లో మంత్రి కె. తారక రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా  మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగంల్లో  కార్మికులు బతికించుకోవాలని అనేక కార్యక్రమాలు చేపట్టాము.  చేనేత పై 5 శాతం జీఎస్టీ వేసిన ఘనత మోడిది. పద్మశాలి కుటుంబంలో ఉండి మన ముఖ్యమంత్రి చదువుకున్నారు వారి సమస్యలు ముఖ్యమంత్రి కి తెలుసన్నారు. 

ఫ్రేమ్ మగ్గాలు ఏర్పాటు కోసం  40.50 కోట్లు

చేనేత మిత్ర పథకం లో రాబోయే నేల నుండి ప్రతి మగ్గానికి నెలకు 3000 వేల చొప్పున ప్రతి కార్మికుడికి ఇస్తాము అని తెలిపారు.  రైతులకు రైతు బీమా చేయించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ ది. నేతన్న బీమా ఇస్తున్నాము అని గుర్తు చేసారు. 59 ఏళ్లు పైబడిన వారికి ప్రభుత్వం మే బీమా ఇస్తుంది. చేనేత హెల్త్ కార్డు 25 వేల రూపాయలు కార్డు ప్రకటించిన మంత్రి కేటీఆర్..

ప్రైమ్ మగ్గాలు ఏర్పాటు కోసం  40.50 కోట్లు అందిస్తాము అన్నారు. ఒక్కొక్క మగ్గానికి 38000 వేల రూపాయలు. చేనేత కార్మికులకు ఐడీ కార్డులు ఇస్తున్నాము.. టెస్కో ద్వారా వీవర్స్ మెంబర్స్ కు ఎక్స్ గ్రేషియా పెంచాము.. 25000 నేత కార్మికుల కోసం గృహలక్ష్మి తీసుకొస్తాం అన్నారు. కార్మికులగా సూరత్ వెళ్లి..ప్రభుత్వం ఇచ్చిన సహకారంతో పారిశ్రామిక వేతలుగా వచ్చారు. 

పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ 12.60 కోట్లతో పునరుద్ధరణ 

ఉప్పల్ భగాయత్ లో హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నాము..శంకుస్థాపన చేశామన్నారు. పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ 12.60 కోట్లతో పునరుద్ధరణ చేస్తున్నామన్నారు. చేనేత పైన ఐదు శాతం జీఎస్టీ వేసిన ప్రధాని మోడీ. చేనేత వద్దు పథకాలు అన్ని రద్దు అన్నట్లు కేంద్ర ప్రభుత్వం తీరు ఉన్నదన్నారు. కేంద్ర ప్రభుత్వానికి అందులో నాయకులకి నేత తెలవదు నేతన్నల కష్టాలు తెలవదు అని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది. అందులో మన ప్రభుత్వం ఉంటుంది.  కేంద్రం రద్దు చేసిన. కార్యక్రమాలన్నీ కూడా తీసుకొస్తాం అన్నారు.  మీకు పని చేసే ప్రభుత్వానికి అండగా ఉండాలని సూచించారు.