mt_logo

పురపాలక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం 9 ఏళ్లలో  రూ.1.22 లక్షల కోట్లు ఖర్చు చేసింది : మంత్రి కేటీఆర్

శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా పల్లె, పట్టణ ప్రగతి ద్వారా సాధించిన పురోగతిపై మంత్రి కేటీఆర్ మాట్లాడారు.  దేశాభివృద్ధికి మౌలిక వసతులు ఎంతో అవసరం అని సూచించారు. 9 ఏండ్లుగా తెలంగాణ అభివృద్ధికి నిర్మాణాత్మకంగా పని చేస్తున్నాం అన్నారు.  ఒక వైపు సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే మౌలిక వసతులకు భారీగా కేటాయింపులు చేస్తున్నాం. మా దృష్టిలో బడ్జెట్‌ అంటే ప్రజల జీవనాడి.  బడ్జెట్‌లో పెట్టుబడి వ్యయంలో తెలంగాణే ముందుందని తెలిపారు. బడ్జెట్‌లో పెట్టుబడి వ్యయం ఛత్తీస్‌గడ్‌లో 15 శాతం, రాజస్థాన్‌లో 16 శాతం అని తెలిపారు. తెలంగాణలో 26 శాతం పెట్టుబడి వ్యయంగా పెడుతున్నాం. నేను చెప్పేది తప్పుంటే వచ్చే ఎన్నికల్లో ఓడించండని దైర్యంగా చెప్పారు. 

-తెలంగాణలో పల్లె మురిసింది.. పట్టణం మెరిసింది 

-పల్లెల్లో హార్వస్టర్లు.. పట్టణంలో ఇన్వెస్టర్లు పరుగులు పెడుతున్నారు 

భట్టి చెప్పేవన్ని అబద్ధాలే.. అని తెలిపారు. 10 కాలాల పాటు నిలిచే పథకాలను సీఎం కేసీఆర్ రూపొందించారన్నారు.  రాబోయే తరాలు గుర్తుపెట్టుకునేలా రాష్ట్రాభివృద్ది జరిగిందన్నారు. 

రాష్ట్ర బడ్జెట్ అంటే ప్రతిపక్షాలకు జమ, ఖర్చుల లెక్క మాత్రమే కానీ మాకు బడ్జెట్‌ అంటే రాష్ట్ర ప్రజల జీవన లేఖ.. అన్నారు. మౌలిక వసతులపై బడ్జెట్‌లో 26 శాతం ఖర్చు పెడుతున్నామని అన్నారు. సంక్షేమంతో పాటు మౌలిక వసతులకు ప్రాధాన్యం ఇస్తున్నాం. 

తెలంగాణ నమూనా అంటే సమగ్ర, సమ్మిళిత అభివృద్ధి.. 

మౌలిక వసతుల కల్పనలో గ్రామాలు, పట్టణాలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం, సేవా, పారిశ్రామిక రంగం దూసుకుపోతున్నాయి. నీళ్ల కోసం రోజుకొక ట్యాంకర్ తెచ్చుకుంటున్నామన్న భట్టి వ్యాఖ్యలు అవాస్తవమని తెలిపారు. 

2022 జనవరం నుంచి భట్టి ఒక్క ట్యాంకర్‌ కూడా బుక్‌ చేయలేదు.  భట్టి ఇంట్లో మీటర్ చెడిపోవడం వల్లే రూ.2.90 లక్షల నీటి బిల్లులు చెల్లించాల్సి వచ్చింది. మీటర్ పనిచేసి ఉంటే.. భట్టి ఇంటికి కూడా ఉచిత మంచినీటి పథకం వర్తించేది. నగరంలో ప్రతి ఒక్కరికి 20 వేల లీటర్ల మంచినీరు ఉచితంగా ఇస్తున్నాం అని తెలిపారు మంత్రి కేటీఆర్. కర్ణాటకలో గెలిచారని తెలంగాణలో కలలు కంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయింది. మేం చేసిన అభివృద్ధిపై ఎంత చెప్పినా కాంగ్రెసోళ్లకు అర్థం కాదన్నారు. కాంగ్రెస్‌కు నాయకులే లేరు.. పక్క పార్టీల నుంచి నాయకులను తెచ్చుకున్నారు.  

మేం మోదీకే భయపడలేదు.. ఇక్కడ పిచ్చి రాతలు రాస్తే భయపడతామా? అని ప్రశ్నించారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి కాంగ్రెస్‌కి కనిపించడం లేదా? తెలంగాణ గ్రామాలన్నీ ఇప్పుడు కోనసీమల్లా మారాయని అన్నారు. పచ్చధనంతో మురిసిపోతున్న పల్లెలకు సినిమా వాళ్లు షూటింగ్‌లకు తరవస్తున్నారు. దేశం నలుమూలల నుంచి తెలంగాణకు వలసలు వస్తున్నారు. రివర్స్‌ మైగ్రేషన్‌ జరుగుతుందని ఎప్పుడైనా ఊహించామా. కాంగ్రెస్‌ హయాంలో నీళ్ల కోసం మహిళలు తిప్పలు వర్ణనాతీతమన్నారు.  

 మిషన్‌ కాకతీయతో 28వేల చెరువులను బాగు చేసుకున్నామని తెలిపారు. కేంద్రం సహకరించకపోయినా మేం అభివృద్ధి చేసినం. రాష్ట్రంలో 2600 రైతు వేదికలు నిర్మించినమన్నారు.  రాష్ట్రంలో 16 వేల నర్సరీలు ఏర్పాటు చేసినం  

దేశంలో 30శాతం అవార్డులు తెలంగాణ పల్లెలకే వచ్చినయన్నారు. దేశంలోనే ఉత్తమ జిల్లా పరిషత్‌గా ములుగు అవార్డు అందుకుంది. కాంగ్రెస్‌ 10 ఏళ్ల పాలనలో గ్రామాభివృద్ధికి పెట్టిన మొత్తం ఖర్చు రూ. 6142 కోట్లు. 9 ఏళ్లలో BRS ప్రభుత్వం గ్రామాలాభివృద్ధికి రూ.29 వేల కోట్లకు పైగా ఖర్చు చేసింది  

నీళ్ల కోసం ఆనాడు . జానారెడ్డి దగ్గరికి వెళ్తే కన్నీళ్లు పెట్టించిండు.   

దమ్మున్న నేత దేశంలో కేసీఆర్ ఒక్కరే

కాంగ్రెస్‌ హయాంలో మానేరు ఒడ్డు కూడా నీళ్లు లేవని గుర్తు చేసారు. 10 సార్లు ఓటు వేసినందుకు కాంగ్రెస్‌ తెలంగాణ ప్రజలను అగం చేసింది. ఇంటింటికి నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగమన్న దమ్మున్న నేత దేశంలో కేసీఆర్ ఒక్కరే. కాంగ్రెస్‌ 60 ఏళ్లల్లో చేయని పనులను 6ఏళ్లల్లోనే చేసి చూపించాం. గుజరాత్ మోడల్ అంతా ఒట్టి డొల్ల అన్నారు. తెలంగాణలో ప్రతి ఇంటికి నీళ్లు ఇస్తున్నారని కేంద్ర . పార్లమెంట్‌లోనే ప్రకటించారు.  తెలంగాణలో భూమి బంగారం అయ్యింది. ప్రజలకు నీళ్లు తాపిస్తున్నాం.. ప్రతిపక్షాలకు మూడు చెరువుల నీళ్లు తాపిస్తాం.. 

ఒక్క డబుల్ బెడ్ రూం ఇళ్లు 7 ఇందిరమ్మ ఇళ్లతో సమానం

మిషన్‌ భగీరథ యజ్ఞంలో పని చేసినందుకు సంతోషంగా ఉంది  

రాష్ట్రంలో కొత్తగా లక్షన్నర కిలోమీటర్ల పైపులైన్లు వేశాం..  9 ఏళ్లలో పురపాలక శాఖ ఆధ్వర్యంలో రూ.1.22 లక్షల కోట్లు ఖర్చు చేశాం. నల్గొండ అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. తెలంగాణ రాకముందు హైదరాబాద్‌లో వాహనాల సంఖ్య 71లక్షలు.. ఇప్పుడు వాహనాల సంఖ్య 1.52 కోట్లు . రాష్ట్ర వ్యాప్తంగా 2.28 లక్షల డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం చేపట్టాం.  ఒక్క డబుల్ బెడ్ రూం ఇళ్లు 7 ఇందిరమ్మ ఇళ్లతో సమానం.  గృహలక్ష్మి పథకం కింద మరింత మందికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం. మంచినీళ్లు ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్‌ రాష్ట్రాన్ని వదిలిపెట్టి పోయింది. దశాబ్ధాలు పరిపాలించి కరెంట్‌ ఇవ్వలేకపోయారన్నారు. 

తెలంగాణలో డీఆర్‌ఎఫ్‌ ఏర్పాటు చేసినం ..

త్వరలో చెత్త ద్వారా 101 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయబోతున్నాం . . 

ఎస్‌ఆర్‌డీపీ కింద 35 ఫ్లై ఓవర్‌లు కట్టినం . . 

సొంత రాష్ట్రం ముందుకు పోతుంటే మెచ్చుకునే పరిస్థితి కాంగ్రెస్‌ వాళ్లకు లేదు .. 

వచ్చే సారి కూడా 100 శాతం మేమే అధికారంలోకి వస్తాం.. 

మెట్రోను విస్తరిస్తాం ..

-అనుమాన పక్షులు ఇంట్లో పండుకోవాల్సిందే . . 

-సోనియా గాంధీ బలిదేవత అని రేవంత్‌ అన్నడు . . 

-తెలంగాణ ప్రజలు తయారుచేసిన బ్రహ్మాస్త్రమే కేసీఆర్‌ అని వ్యాఖ్యానించారు కేటీఆర్.