mt_logo

ఓట్ల కోసం సర్కస్ ఫీట్లు చేస్తున్న కాంగ్రెస్ నేతలు: మంత్రి కేటీఆర్

తెలంగాణ భవన్‌లో ఆటో యూనియన్ కార్మికుల ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 2014 నుంచి తెలంగాణలో మార్పు వచ్చిందా? లేదా? అని అడిగారు. అప్పుడున్న భూమి ధరలు ఇప్పుడున్న భూమి ధరలు ఒక్కసారి గమనించండని సూచించారు. రైతులకు ఒక్క పైసా ఇవ్వని పార్టీలు ఇప్పుడు నేతలు చెప్తున్నారు. విద్యార్థుల చదువుల కోసం ఖర్చు పెడుతున్న ఏకైక రాష్ట్రం మనది అని తెలియజేసారు. 

నిజంగా నిరుద్యోగులు అంటే కాంగ్రెస్ నేతలు మాత్రమే అని ఆరోపించారు. వాళ్ళు పదవుల కోసం రాజకీయ నిరుద్యోగులు అని ఎద్దేవా చేసారు. ఉదయ్‌పూర్ డిక్లరేషన్ అంటూ ఒక్క ఇంటికి ఒక సీటే అన్నారు. కానీ ఇంటికి ఇద్దరు అభ్యర్థులు పోటీ చేస్తున్నారని అన్నారు. నోట్ల కట్టలతో  దొరికిన చిల్లర గాడు రేవంత్ రెడ్డి. ఆయన  కూడా నీతులు చెప్తున్నాడని ధ్వ‌జ‌మెత్తారు. 

ఆటో యూనియన్‌లను ఆదుకున్నది కేసీఆర్ మాత్రమే అని స్పష్టం చేసారు. 100 కోట్లతో ఆటో కార్మికులను ఆదుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు సచ్చెది లేదు. ఓట్ల కోసం సర్కస్ ఫీట్లు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు అని ఎద్దేవా చేసారు. మెదక్‌లో ఒకడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒకడు 48 గంటల కరెంటు ఇస్తానని అంటున్నాడు. మనకు ఉన్నదే 24 గంటలు, కానీ 48 గంటల కరెంటు ఎట్లా ఉంటదని అడిగారు.