mt_logo

గులుగుడు గులుగుడే గుద్దుడు గుద్దుడే: మంత్రి కేటీఆర్ 

నాగోల్‌లోని దేవకి కన్వెన్షన్‌లో తెలంగాణ రాష్ట్ర హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసుకున్నాం అని తెలిపారు. రాష్ట్రం వచ్చాక మౌలిక వసతులు బాగుపడ్డాయని స్పష్టం చేసారు. కరెంట్ సమస్యలు ఎలా ఉండెనో మీకు తెలుసు.ఇప్పుడు కరెంట్ పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసు. ఇప్పుడు కడుపు నిండా కరెంట్ ఇచుకున్నాం, సాగు,తాగు నీరు సమస్యలు తీర్చుకున్నాం, వరి ధాన్యం దిగుబడిలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉన్నాం అని వివరించారు. దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఇవాళ ఎదిగినం అని వెల్లడించారు. 

సంపద పెంచింది కేసీఆర్ 

మునుగోడులో గోడు తీర్చినం…. ప్లోరోసిస్‌తో మునుగోడులో ఎంతో మంది ఇబ్బందులు పడ్డారు అలాంటిది ఇవాళ ప్లోరోసిస్‌ను రూపుమాపేందుకు మిషన్ భగీరథ కార్యక్రమం రూపకల్పన చేసి ఇవాళ పూర్తిగా సమసి పోయిందని అభివర్ణించారు. అన్ని వర్గాలను,అన్ని రంగాలను అన్ని విధాలా ఆదుకున్న ఏకైక ప్రభుత్వం మాదే….మన ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అని చెప్పారు.  కొత్త సీసాలో పాత సారా నే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ. 2009 లో 9 గంటల కరెంట్, ఆరు కిలోల బియ్యం ఇస్తాం అన్నారు. ఆనాడు ఇవ్వే ఇస్తే ఎలా అని వైస్సార్‌ను అడిగితే ఆర్ధిక పరిస్థితి బాగా లేదు అన్నాడని గుర్తు చేసారు. సంపద పెంచింది ముఖ్యమంత్రి కేసీఆర్ అని స్పష్టం చేసారు. 

చేనేత మిత్రను 5000 కు పెంపు 

మంచిగ చేసిన కేసీఆర్ ఉండగా మీకు ఎందుకు ఓటు వేయాలి అని అడుగుతున్న అని ప్రశ్నించారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏదో అంటున్నారు. మళ్ళీ ప్రభుత్వం మనదే వస్తుంది …  ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పుడు 3 వేలు ఉన్న చేనేత మిత్రను  5 వేలు చెస్తాం నేను హామీ ఇస్తున్న అని పేర్కొన్నారు. సంపద పెంచాలి పేదలకు పంచాలి అనేది మా నినాదం అన్నారు. దృఢమైన నాయకత్వం స్థిరమైన ప్రభుత్వం ఉండాలి.  6నెలలకు ఒక్క ముఖ్యమంత్రి అయ్యే ప్రభుత్వం మనకు ఎందుకని అడిగారు. 

అవతల 11 మంది ముఖ్యమంత్రులు, ఇవతల ఒక్క కేసీఆర్

ఢిల్లీలో నుండి సీల్డ్ కవర్‌లో వచ్చే ముఖ్యమంత్రులు మనకు ఎందుకు?  చేనేత రుణమాఫీ చేసుకుందాం. ఇది చేతల ప్రభుత్వం…. చేనేతల ప్రభుత్వం.ఎవరి చేతులో రాష్ట్రాన్ని పెట్టాలో ఆలోచన చేయాలన్నారు.  ఎవరి చేతిలో పెడితే బాగుంటుందో ఆలోచన చేయాలి.ఓట్లు వస్తాయి …గెలుపు ఓటములు ఎవరి సొంతం కాదన్నారు. అవతల 11 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఇవతల ఒక్క కేసీఆర్ ఉన్నాడని తెలిపారు. ఒక్క నల్గొండ జిల్లాలో 4 ముఖ్యమంత్రులు ఉన్నారు. ఒక్కయన ఆ పార్టీలో ముర్తం కూడా పెట్టాడు. పిల్లే లేదు కానీ పెళ్లి ముహూర్తం పెట్టాడు ఆయన, గులిగిన అలిగిన మన ఇంట్లో వారితోనే పని చేయించుకోవాలని సూచించారు. గులుగుడు గులుగుడే గుద్దుడు గుద్దుడే అన్నారు.