ఢిల్లీ అహంకారానికి తెలంగాణ తల వంచదు, తల దించదని మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. బుధవారం తెలంగాణ భవన్‌లో కూకట్‌పల్లి కాంగ్రెస్ నేత గొట్టిముక్కల వెంగళ్‌రావు, పీసీసీ డాక్టర్స్ సెల్ అధ్యక్షుడు జీ. విశ్వతేజరావు, రాజమల్లయ్య, చున్నూబాయ్, పుష్పరాజ్, యాకయ్య, కంచిస్వామి, దినేశ్, వెంకట్, కిట్టు, మల్లేశ్‌గౌడ్, గురుమూర్తి, గణేశశ్, మహ్మద్ షమీ, మహ్మద్ షరీఫ్, అస్లామ్, ప్రవీణ్‌గౌడ్, మహేశ్‌గౌడ్, అరుణ్, రేష్మ, సంధ్య, కల్పన, కృష్ణవేణి సహా 1000 మంది కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్‌కుమార్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుల సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు.
మహిళలకు పెద్ద పీట
కేసీఆర్ నాయకత్వంలో పల్లెలు, పట్టణాలు అభివృద్ధి చెందాయని తెలిపారు. మళ్ళీ కేసీఆర్ సీఎం కావాలని ప్రజలంతా కోరుకుంటున్నని పేర్కొన్నారు. ప్రజలు ఎక్కడ సభ పెట్టిన లక్షల మంది వస్తున్నారు, మళ్ళీ అధికారంలోకి వచ్చాక మహిళలకు పెద్ద పీట వేయబోతున్నాం అని స్పష్టం చేసారు. మాది పేదల ప్రభుత్వం, ఈ తొమిదిన్నరెళ్ళలో ఎక్కడ కూడా గొడవలు జరగలేదని తేల్చి చెప్పారు. అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్ళామని తెలిపారు.
ఢిల్లీ దొరలకు తెలంగాణ ప్రజలకు పోటీ
కూకకట్‌పల్లి ఎమ్మెల్యేను ఈ సారి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్ష పార్టీలు మాట్లాడే చిల్లర మాటలు మీరు గమనించండని సూచించారు. రాహుల్ గాంధీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడారని, దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణ పోటీ అని రాహుల్ అంటున్నారు. నిజమే ఢిల్లీ దొరలకు తెలంగాణ ప్రజలకు మధ్య జరిగే పోటీ ఇది అని అభివర్ణించారు. మీ తాత నెహ్రూ బలవంతంగా ఆంధ్రాలో కలిపాడని ఆగ్రహం వ్యక్తం చేసారు.
అప్పుడు కాంగ్రెస్ దొరలతో, ఇప్పుడు మరో మోడీ బీజేపీ దొరతో పోరాటం
1956 లో ఇదే రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది, ఇలా కలపటం వల్ల 56 యేళ్లు గోస పడ్డదని వెల్లడించారు. రాహుల్ గాంధీ నాయనమ్మ వల్ల వందల మంది తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేశారని గుర్తు చేసారు. ఢిల్లీ దొరల కారణంగా వేల మంది బలిదానం చేసుకున్నారని మండిపడ్డారు. అనివార్యంగా తర్వాత తెలంగాణ ఇస్తామని ప్రకటన చేశారు. అప్పుడు కాంగ్రెస్ దొరలతో, ఇప్పుడు మరో మోడీ బీజేపీ దొరతో పోరాడుతున్నాం అని తెలిపారు.
గాంధీ మాకు నీతులు చెప్పనవసరం లేదు
మీ ఢిల్లీ అహంకారానికి తెలంగాణ తల వంచదు, తల దించదని తేల్చి చెప్పారు. ఓటుకు నోటుకు దొంగ పక్కన పెట్టుకొని రాహుల్ గాంధీ అవినీతి గురించి మాట్లాడుతున్నారు. ఎవడెవడో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివే వ్యక్తి రాహుల్ గాంధీ, చిల్లరగాల్లకు పదవులు ఇచ్చే రాహుల్ గాంధీ మాకు నీతులు చెప్పనవసరం లేదని పేర్కొన్నారు.