
మెదక్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి లీడర్ లేరు బీజేపీ పార్టీకి క్యాడర్ లేదు. కేసీఆర్‌కు బీఆర్ఎస్‌కు తిరుగులేదన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరే అని అన్నారు.
టికెట్లు ఇచ్చేందుకు దరఖాస్తులు తీసుకునే పరిస్థితి కాంగ్రెస్‌లో ఉంది. లీడర్లు లేకనే దరఖాస్తులు తీసుకుంటున్నారని తెలిపారు. 35 నుంచి 40 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు వారికి నాయకులే లేరు. ఫీజులు వసూలు చేస్తూ దరఖాస్తులు అమ్ముకుంటున్నారు. అభ్యర్థుల దరఖాస్తులు అమ్ముకున్న పార్టీ రేపు రాష్ట్రాన్ని కూడా అమ్ముతుందని పేర్కొన్నారు.