టికెట్లను అమ్ముకున్నవాళ్ల చేతిలో పెడితే రాష్ట్రాన్ని కూడా అమ్ముకుంటారని మంత్రి హరీశ్ రావు తేల్చి చెప్పారు. ఆదిలాబాద్‌లో ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు వరకు ఆమరణ దీక్ష నడిపిన గడ్డ ఆదిలాబాద్ గడ్డ అని తెలిపారు. ఎక్కడికి వెళ్ళినా మూడోసారి సీఎం అయ్యేది కేసీఆర్ అంటున్నారు. బూతులు మాట్లాడే నాయకుల చేతిలో ఉంటే మంచిదా, భవిష్యత్ ఆలోచించే నాయకులు మంచిదా? అని అడిగారు. మీ సీఎం అభ్యర్థి ఎవరు అంటే కేసీఆర్ అంటాం. కాంగ్రెస్ లో ఎవరు? ఉన్నారు. పదేళ్ల తెలంగాణలో కర్ఫ్యూ లేదు, కరువు లేదన్నారు.
హ్యాట్రిక్ కొట్టేది కేసీఆరే
అడవుల జిల్లా నేడు అభివృద్ధి ఖిల్లాగా మారిందని స్పష్టం చేసారు. విద్యాలయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్,ఐటీ లో నెంబర్ వన్, డాక్టర్ల ఉత్పత్తిలో నంబర్ వన్ తెలంగాణ అని తేల్చి చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ రెండు ఒక్కటే. మునుగొడులో ఒకటిగా ఉన్నాయని గుర్తు చేసారు. ఎవరెన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కొట్టేది కేసీఆరే అని ధీమా వ్యక్తం చేసారు.
తెలంగాణ బిడ్డనా, ఢిల్లీ గడ్డనా??
ఢిల్లీ అహంకారం గెలవాలా? తెలంగాణ ఆత్మగౌరవం గేలవాలా? అని అడిగారు. తెలంగాణ బిడ్డనా, ఢిల్లీ గడ్డనా?? ఆలోచిందన్నారు. కేసీఆర్ కష్టపడి తెలంగాణ సాధించాడు. ఒక పసి పిల్లలాగా కాపాడుకున్నాడు. కాంగ్రెస్, బీజేపీ వాళ్ళను కర్ణాటక, మహారాష్ట్ర తీసుకు వెళ్లి చుపెట్టాలి. డీకే శివకుమార్ ఏం ముఖం పెట్టుకొని వస్తున్నావని అడిగారు. కర్ణాటకలో రైతులు ముసల్లు వదులుతున్నారు. నారాయణ్ ఖేడ్ వచ్చి కర్ణాటక రైతులు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌ను నమ్మొద్దని సూచించారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ఆగం పట్టిస్తదని హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలి
అమిత్ షా వచ్చి సీసీఐ గురించి ఒక్క మాట మాట్లాడలేదని వెల్లడించారు. అలాంటి బీజేపీని ఎన్నికల్లో జప్తు చేయాలని అన్నారు. రైతు బంధు ఆపాలని కాంగ్రెస్ చూస్తున్నది. రైతు బంధు వద్దన్న కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలన్నారు. జోగు రామన్న మంచి వ్యక్తి. గెలిపించాలని కోరుతున్నా అని విజ్ఞప్తి చేసారు.
బీఆర్ఎస్ సెంచరీ ఖాయం
రైతు రుణమాఫీ ఒక్క పైసా లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. లోయర్ పెన్ గంగ, చనాక కొరటా లాగా పూర్తి చేసింది కేసీఆర్ అని స్పష్టం చేసారు. బీజేపీ డక్ అవుట్, కాంగ్రెస్ రన్ అవుట్, కేసీఆర్ సెంచరీ అని తేల్చి చెప్పారు. టికెట్లు అమ్ముకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీ, పోటీ చేసేందుకు సత్తా లేని పార్టీ కాంగ్రెస్, టికెట్లు అమ్ముకున్న వాళ్ళు, తెలంగాణను అమ్ముకుంటారని అన్నారు.
ఓటుకు నోటు దొంగల చేతుల్లో కాదు ఉండాల్సింది త్యాగధనుడు కేసీఆర్ చేతిలో జోగురామన్నను మంచి మెజార్టీతో గెలిపించాలని సూచించారు. కాంగ్రెస్ లిస్టు బయటికి వచ్చాక బీఆర్ఎస్ సెంచరీ కొట్టేది ఖాయం అయ్యిందని మంత్రి హరీష్ రావు ప్రసంగించారు.