మంచిర్యాల జిల్లా, హాజీపూర్ మండలంలో 1 టీఎంసీల సామర్థ్యం గల రూ.80 కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించనున్న పడ్తన్ పల్లి లిఫ్ట్ ఇర్రిగేషన్ ప్రొజెక్ట్‌కు ఆర్థిక, వైద్య, ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్ రావు భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. రెండు పంటలు పక్కగా పండుతాయి. హాజీపూర్, లక్షెట్టిపేట్ నీళ్లు కొరత ఉండదు. 30 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ , వైఎస్ జిల్లా చేస్తానని మాట తప్పనని అన్నారు. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు.
కాంగ్రెస్ అంటే మాటలు, మూటలు, మంటలు
కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, గృహ లక్ష్మి, కళ్యాణ లక్ష్మి ఇలా అనేక కార్యక్రమాలు, పదేళ్లలో ఎంతో అభివృద్ధి. తెలంగాణ ఆచరిస్తది దేశం అనుసరిస్తదని అన్నారు. 24 గంటలు ప్రజల మధ్య ఉండే ఎమ్మెల్యే దివాకర్ రావు అని పేర్కొన్నారు. బ్యాంకులు లూటీ చేసిన వాళ్ళు, గుండాలు మంచిర్యాల వస్తున్నారు. పేకాట క్లబ్బులు, మోసాలు చేసిన వాళ్ళు తయారు అవుతున్నారు. ఎవరు అవునన్నా కాదన్నా బీఆర్ఎస్ మూడోసారి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
నేను హాజీపూర్ అల్లుడిని. మంచిర్యాల అభివృద్ధికి నా వంతు కూడా కృషి చేస్తానన్నారు. మేనిఫెస్టో వస్తుంది. అది వస్తే ప్రతిపక్షాల దిమ్మ తిరుగుతుంది. కాంగ్రెస్ అంటే మాటలు, మూటలు, మంటలు అని అన్నారు. సీఎం కుర్చీ కోసం మతం మంటలు రేపిన పార్టీ కాంగ్రెస్, నక్సలైట్లతో చర్చలు అని వారిని మట్టుబెట్టింది కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు.
నడ్డా.. ఇది కేసీఆర్ గడ్డ
కాంగ్రెస్ పార్టీది భస్మాసుర హస్తమని అన్నారు. నడ్డా.. ఇది కేసీఆర్ గడ్డ. సొంత రాష్ట్రంలో హిమాచల్ ప్రదేశ్ లో పార్టీ గెలుపించుకొలేదు, ఇక్కడ వచ్చి నువ్వు చేసేది ఏమీ లేదని తెలిపారు. మిస్టర్ బీఎల్ సంతోష్ తెలంగాణలో వచ్చేది హంగ్ కాదు, బీఆర్ఎస్ హ్యాట్రిక్ కాయం అన్నారు. బీజేపీ డిపాజిట్ల కమిటీ వేసుకుంటే మంచిదన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పదికి పది గెలుస్తామని అన్నారు.