mt_logo

తెలంగాణలో జనాలని నమ్ముకున్న నాయకుడే నిలబడతాడు, జమిలీని నమ్ముకున్న నాయకుడు కాదు: మంత్రి హరీష్ రావు

  • నల్లాలు ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలా నల్ల చట్టాలు తెచ్చిన బీజేపీ కావాల్నా?
  • తెలంగాణ సమాజం మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి చేయాలని సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకుంది

హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల సన్నాహక కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ఎట్లా ఉండాలంటే సతీష్ బాబు లాగా ఉండాలే అన్నారు. నిజాయితీ గల శాసనసభ్యుడు,  ఆ రోజుల్లో గులాబీ జెండాకు ఉత్తర తెలంగాణలో అడ్డా అంటే మాకు కాపిటల్ లక్ష్మీకాంతరావు అని అన్నారు. కొన్ని వందల సార్లు ఉద్యమంలో  అన్నం పెట్టి ఆతిథ్యం ఇచ్చినటువంటి గొప్ప ఇల్లు మా సతీష్ అన్నది.  తెలంగాణ కోసం గట్టిగా నిలబడేటువంటి మంచి మనసున్న కుటుంబం మా కెప్టెన్ కుటుంబమని తెలిపారు. రాష్ట్రంలో ఎవరినడిగినా మూడోసారి ఎవరు ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ అనే సమాధానం వస్తుంది. హుస్నాబాద్ లో కూడా మూడోసారి సతీష్ కుమార్ ని గెలిపించుకుందామన్నారు. 

కాంగ్రెస్ పార్టీది దొంగ డిక్లరేషన్

హుస్నాబాద్ నియోజకవర్గంలో తండాలు గ్రామ పంచాయతీలు అయినయ్ అంటే గౌరెల్లి ప్రాజెక్టు పూర్తవుతుందంటే ఇది కేవలం సీఎం కేసీఆర్ వల్లనే సాధ్యమైందన్నారు.  మిడ్ మానేరు ద్వారా గోదావరి నీళ్లను హుస్నాబాద్ నియోజకవర్గానికి తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అన్నారు.  గండి మహాసముద్రం ఏడాది లోపట నిర్మించి నిలిచినం. గౌరెల్లి ప్రాజెక్టు నిర్మాణంలో ఎన్నో అడ్డంకులు సృష్టించారు అయినా సరే గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసింది బీఆర్ఎస్  ప్రభుత్వం అని తెలిపారు. ఏడాదికి రెండు పంటలు పండుతున్నాయి అంటే అది కేసీఆర్ వల్లనే సాధ్యమైంది,  కాంగ్రెస్ పార్టీది దొంగ డిక్లరేషన్. 50 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో 2000 పెన్షన్ ఇచ్చారా, కల్యాణ లక్ష్మి ఇచ్చారా, మిషన్ భగీరథ మంచినీళ్లు ఇచ్చారా? అని ప్రశ్నించారు. 

చెప్పిన హామీలు, చెప్పని  హామీలను కూడా నెరవేర్చారు సీఎం

తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ఓట్లు అడుగుతదన్నారు.  చీప్ ట్రిక్కులకు మాయమాటలకు ప్రజలు మోసపోవద్దని సూచించారు. తెలంగాణ సమాజం మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి చేయాలని సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకుంది. గులాబీ సైనికులుగా మనం ప్రతి ఇంటికి వెళ్లి వాస్తవాలను ప్రజలకు వివరించాలి. కాంగ్రెస్ పాలిత ఛత్తీస్‌గడ్, కర్ణాటకలో తెలంగాణలో ఉన్న సంక్షేమ పథకాలు ఉన్నాయా?  కాంగ్రెస్ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో తెలంగాణ సంక్షేమ పథకాలు అమలు చేసి తెలంగాణ ప్రజలను ఓట్లు అడగండి. 

కేసీఆర్ మేనిఫెస్టోలో చెప్పిన హామీలు,  చెప్పని  హామీలను కూడా నెరవేర్చారని గుర్తు చేశారు. కరోనా వచ్చినా కేంద్ర ప్రభుత్వం తిప్పలు పెట్టినా కేసీఆర్ రైతు రుణమాఫీ చేసిండని పేర్కొన్నారు. 

హిందూ ముస్లింల కొట్లాట పెట్టి బీజేపీ గెలవాలనే ప్రయత్నం 

రాష్ట్రంలో బీజేపీ బిచాణ ఎత్తేసింది. ఈ ఐదు రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి భయంతోనే జమిలి ఎలక్షన్లు అంటుంది. తెలంగాణలో జనాలని నమ్ముకున్న నాయకుడే నిలబడతాడు జమిలిని నమ్ముకున్న నాయకుడు కాదన్నారు. ఇండియా పాకిస్తాన్ మధ్య కొట్లాట, హిందూ ముస్లింల కొట్లాట పెట్టి బీజేపీ గెలవాలనుకుంటుంది. రైతు నల్ల చట్టాలు తెచ్చింది బీజేపీ. నల్లాలు ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలా? నల్ల చట్టాలు తెచ్చిన బీజేపీ కావాల్నా? అని ప్రశ్నించారు. 

నూకలు బుక్కమన్న బీజేపీకి నూకలు లేకుండా చేసిన ప్రజలు

రైతుబంధు కింద 72,000 కోట్లు రైతుల అకౌంట్లో వేసాం అని తెలిపారు.  60 వేల కోట్లతో రైతులకు ఉచిత కరెంటు ఇచ్చాము ఇప్పటివరకు అని పేర్కొన్నారు.  హుస్నాబాద్‌కి ఆర్డిఓ ఆఫీస్ తెచ్చింది ఎమ్మెల్యే సతీష్, హుస్నాబాద్‌లో  అభివృద్ధి జరిగిందంటే అది కేవలం సతీష్ బాబు గారి వల్లే అన్నారు. హుస్నాబాద్‌లో గత పాలకులు కడుపులు నింపుకునే పనిలో ఉన్నారు కాబట్టి అభివృద్ధి జరగలేదు. పేదల కడుపు నింపే నాయకుడు సతీష్ ఉన్నాడు కాబట్టి అభివృద్ధి జరిగిందని స్పష్టం చేసారు. 

తిట్లు కావాలంటే బీఆర్ఎస్‌కు కిట్లు కావాలంటే బీఆర్ఎస్‌కు 

తెలంగాణ ప్రజలను నూకలు బుక్కమన్న బీజేపీకి  నూకలు లేకుండా చేశారు ప్రజలు. కాంగ్రెస్ బీజేపీ తిట్లలో పోటీపడితే మనమేమో కిట్లతో పోటీ పడుతున్నాము. కేసీఆర్ కిట్టు న్యూట్రిషన్ కిట్టు,  తిట్లు కావాలంటే కాంగ్రెస్ కు ఓటేయండి కిట్లు కావాలంటే బీఆర్ఎస్ కి ఓటు వేయండన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ 16వ తారీఖున ప్రారంభం చేయనున్నారు. దీన్ని జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు ఆగమాగం అవుతున్నాయని అన్నారు.