mt_logo

2014లో 2850 ఎంబీబీఎస్ సీట్లు.. నేడు 10 వేల సీట్లు: మంత్రి హరీశ్ రావు

ఖమ్మంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. అనంతరం మమత మెడికల్ కాలేజీ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ…  ఖమ్మంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రారంభించుకోవడం, మమత కాలేజీ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. వైద్య విద్యతో పాటు స్పెషాలిటీ వైద్యం ప్రజలకు మెడికల్ కాలేజీల ద్వారా అందుతుందని తెలిపారు. రేపు ఒకే రోజు 9 మెడికల్ కాలేజీలు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయని గుర్తు చేశారు. 

2023-24 గాను దేశంలో వచ్చిన మొత్తం ఎంబీబీఎస్ సీట్లలో 43% తెలంగాణ నుండే అని స్పష్టం చేసారు. ఖమ్మంలో రెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వచ్చాయి.  నాడు విదేశాలకు వెళ్లి వైద్య విద్య చదివే పరిస్థితి ఉండేదన్నారు.  2014లో 2850 సీట్లు ఉంటే నేడు ఏటా 10 వేల సీట్లు వస్తున్నాయి. ఎవరు దరఖాస్తు పెట్టినా మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇస్తున్నామని పేర్కొన్నారు. మొత్తం తెలంగాణలో 56 మెడికల్ కాలేజీలు ఉన్నాయని తెలిపారు. ఇతర రాష్ట్రాల పిల్లలు ఇక్కడి మెడికల్ కాలేజీల్లో చేరుతున్నారని పేర్కొన్నారు.