mt_logo

పదేళ్ల కాంగ్రెస్ పాలనకు, పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది

మంచిర్యాల జిల్లా చెన్నూరులో 50 పడకల ఆసుపత్రి, మొత్తంగా రూ. 55 కోట్ల అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం అనంతరం మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. ఎమ్మెల్యే సుమన్ అంటే సీఎం, కేటీఆర్, మా మంత్రులకు అందరికీ ఎంతో ప్రేమ అని అన్నారు. ఉద్యమ కారుడు సుమన్, అందుకే మా చెయ్యి బట్టి పని చేయించుకుంటడు. చెన్నూరు రెవెన్యూ డివిజన్ సుమన్ వల్ల అయ్యింది. మళ్ళీ సుమన్‌ను గెలిపించాలన్నారు.అభివృద్ధి కొనసాగించాలి,  క్రికెట్ భాషలో చెప్పాలంటే బిజెపి డక్ అవుట్, కాంగ్రెస్ రన్ అవుట్, కేసీఆర్ సిక్సర్ కొడతారని అన్నారు. 

చేరికల కమిటీ అట్టర్ ప్లాప్

నడ్డా వచ్చి ఏదో మాట్లాడుతున్నావు. నడ్డా ఇది తెలంగాణ గడ్డా, కేసీఆర్ అడ్డా. డిపాజిట్‌ల కమిటీ వేసుకోండి. చేరికల కమిటీ అట్టర్ ప్లాప్,  కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తాం గెలుస్తాం అంటారు. లేని రన్ కోసం పోతే డక్ అవుట్ అవుతారని అన్నారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా సెంచరీ కొట్టేది కేసీఆరే అన్నారు. వంద సీట్లతో అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ వెస్ట్ ఇండీస్ టీమ్ లెక్క అయ్యింది. ప్రపంచ కప్ క్వాలిఫై కూడా కావడం లేదు. కర్ణాటక అవినీతి సొమ్ము తెచ్చి ఇక్కడ పంచి గెలవాలని చూస్తున్నారు. రేవంత్ రెడ్డి.. పదేళ్ల కాంగ్రెస్ పాలనకు, పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉందని చెప్పారు. 

పెడితే పెళ్లి, లేదంటే సావు కోరే వ్యక్తి రేవంత్ 

కాంగ్రెస్ గురించి రేవంత్ రెడ్డికి ఏం తెలుసని అడిగారు. టీడీపీలో ఉండి నాడు కాంగ్రెస్‌ని తిట్టావు. నాడు కాంగ్రెస్‌లో ఉన్న నాయకులతో చర్చకు సిద్దం. కిరణ్ కుమార్ రెడ్డి చెప్పుల గుర్తు పార్టీ పెట్టి బీజేపీలో చేరారు. బొత్స సత్యనారాయణ రాజీనామా చేసి వైసీపీలో చేరారన్నారు.డి. శ్రీనివాస్ ఆరోగ్యం బాగా లేకుంట ఉన్నడు. కేకే మా పార్టీలోనే ఉన్నారు.నాడు సోనియా బలి దేవత అంటూ నేడు దేవత అన్నావు, ఇప్పుడు ఏబీవీపీలో ఉన్నావు, బీఆర్ఎస్‌లో చేరావు, తెలుగు దేశంలో చెరావు, ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరావు అని గుర్తు చేసారు. పెడితే పెళ్లి, లేదంటే సావు కోరే వ్యక్తి రేవంత్ రెడ్డి,  నువు మారని పార్టీ లేదు, రేపు ఏ పార్టీలోకి వెళ్తావు అనేది ఎవరికి తెలియదన్నారు. 

పొరపాటునో, గ్రహపాటునో కాంగ్రెస్ గెలిస్తే మొసపోతాం.. 

పక్కనే చత్తీస్గడ్ ఉంది. అక్కడ రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, 2000 పింఛన్ల ఇస్తున్నారా? ఇక్కడ అవి చేస్తాం, ఇవి చేస్తా అంటున్నారు.ఇచ్చే ముఖం అయితే అక్కడ ఇచ్చి చూపండని మంది పడ్డారు. అధికారంలో రాని తెలంగాణలో ఇస్తా అంటారు.కన్నతల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తాడా? అని అడిగారు.  తెలంగాణ ఏర్పాటు తర్వాత చెన్నూరు దశ, దిశ మారింది.తెలంగాణ గౌరవాన్ని ఆకాశం అంత ఎత్తుకు తీసుకువెళ్ళింది కేసీఆరే అని స్పష్టం చేశారు. పొరపాటునో, గ్రహపాటునో కాంగ్రెస్ గెలిస్తే మొసపోతాం.

కాంగ్రెస్ వస్తే  కర్ఫ్యూ వస్తది, కరువు వస్తది

కాంగ్రెస్ అంటే మాటలు, ముఠాలు, మంటలు,  హైదారాబాద్‌లో మత కల్లోలాలు పెట్టిన పార్టీ కాంగ్రెస్, 60 ఏళ్ల పాలనలో నీళ్ళు ఇవ్వలేదు. కాంగ్రెస్ వస్తే  కర్ఫ్యూ వస్తది. కరువు వస్తదని హెచ్చచించారు. గోదావరి వరదలు వచ్చినా పంటలు మునగకుండా ప్లాన్ చేసే బాధ్యత మాది.గోదావరి ప్రాణహిత నది ఒడ్డున కరకట్టలు కట్టి కాపాడుతామన్నారు. ఎమ్మెల్యే సుమన్ నీ బంపర్ మెజారిటీ తో గెలిపించాలని కోరారు.