mt_logo

మోసానికి మారుపేరు, నాటకాలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ: మంత్రి హరీశ్ రావు

మోసానికి మారుపేరు, నాటకాలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని మంత్రి హరీశ్ రావు తెలిపారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో మంత్రి మట్లాడుతూ.. అందరికీ మంచి ప్రాధాన్యం ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యకర్తలు బేధాభిప్రాయాలు లేకుండా పని చేయాలన్నారు. ఉమ్మడి వరంగల్‌లోఅత్యధిక ఓట్లు రావాలని కోరారు. కాంగ్రెస్ టికెట్లు ఇచ్చాక, పట్టపగలు దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని తెలిపారు. 50 కోట్ల డబ్బులు పెట్టి పీసీసీ పదవి కొన్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. అది తప్పు అయితే రాహుల్ గాంధీ చర్యలు తీసుకోవాలని సూచించారు. 5 కోట్లకు టికెట్ అమ్ముకున్నారని అంటున్నారు, ఇలాంటి వాళ్ళ చేతిలో కాంగ్రెస్ పార్టీ ఉందని పేర్కొన్నారు. 

అభ్యర్థులు దొరకడం లేదన్నారు. రిజెక్ట్ వాళ్ళని చేర్చుకుంటారని ఎద్దేవా చేసారు. గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేటలలో పోటీ చేస్తారట, మీ నియోజకవర్గాల్లో పోటీ చేసే దిక్కు మీకు లేదని అన్నారు. మోసానికి మారుపేరు కాంగ్రెస్ పార్టీ అని వెల్లడించారు. నాటకాలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ స్టేషన్‌ఘన్‌పూర్ నిండు కుండ లాగా మార్చింది సీఎం కేసీఆర్ అని స్పష్టం చేసారు. మహిళలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చింది కేసీఆర్, కడియం శ్రీహరి మంచి నాయకులు. రాజన్న, శ్రీహరి కలిసి ఈ నియోజకవర్గం అభివృద్ధి చేస్తారని తెలిపారు. మంచి మెజారిటీతో గెలిపించాలని సూచించారు.