mt_logo

కాంగ్రెస్ వాళ్లది నోరా.. మోరా..? : మంత్రి హరీశ్ రావు

కాంగ్రెస్ వాళ్లది నోరా.. మోరా..? అని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. రాహుల్ గాంధీ వచ్చి కాళేశ్వరం లక్ష కోట్ల అవినీతి అన్నాడు, ఖర్చు పెట్టింది 80 వేల కోట్లు అంటే, లక్ష కోట్ల అవినీతి ఎక్కడిది. కాంగ్రెస్ హయాంలో ఒక్క చెరువు బాగు చేశారా? అని ప్రశ్నించారు. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. రంగనాయక సాగర్ లో ముంచి లేవడితే నీళ్ళు ఉన్నవి, లేనిది తెలుస్తది కావొచ్చు. కాళేశ్వరం పూర్తి చేశాం కాబట్టే భూమికి బరువైన పంట పండుతున్నది. కాళేశ్వరం పని కానిదే ఈ ఘనత సాధ్యం అయ్యిందా? అని సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు అన్నారు.