mt_logo

వారు ఇక ఆర్టీసీ కార్మికులు కాదు ప్రభుత్వ ఉద్యోగులు : మంత్రి హరీశ్ రావు

ఖమ్మం ప్రెస్ మీట్ లో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనాన్ని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకోవడం శుభపరిణామని సంతోషం వ్యక్తం చేసారు.  నా ఆర్టీసీ  కార్మికులకు, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు. ఇది కేసీఆర్ ఇచ్చిన బహుమతి. మీ చిరకాల వాంఛ నెరవేర్చినది కేసీఆరే అని తెలిపారు. ఇక నుండి ఆర్టీసీ కార్మికులు కాదు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అని అన్నారు.

ఇన్ని రోజులు పెండింగ్ లో పెట్టినప్పటికి ఇవాళ ఆమోదం తెలిపింది, ధర్మం గెలుస్తుంది అనడానికి ఇదే నిదర్శనమన్నారు.  నాటి పాలకులు ఆర్టీసీ అడ్రస్ లేకుండా చేయాలని కుట్రలు పన్నారు,  మా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు పట్టం కట్టిందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను చేసింది, ఇకనుండి కార్మికులు కాదు వారు ప్రభుత్వ ఉద్యోగులని ఆనందాన్ని వ్యక్తం చేశారు.