mt_logo

ఎవరు ఔన్నన్న కాదన్న హ్యాట్రిక్ కొట్టేది కేసీఆరే : మంత్రి హరీష్ రావు

సంగారెడ్డి: ఆందోల్‌లో బీసీ బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఎవరు ఔన్నన్న కాదన్న హ్యాట్రిక్ కొట్టేది మాత్రం కేసీఆరే అన్నారు. కాంగ్రెస్ వస్తే రైతు బంధు, రైతు బీమా బంద్ అవుతాయని హెచ్చరించారు. రేపు వచ్చే ఎన్నికల్లో మూడు గంటలు కరెంట్ ఇచ్చే వారికి ఓటేయలా..? 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చే కేసీఆర్ ఓటెయ్యాలా ఆలోచించుకోండని సూచించారు.

కాంగ్రెస్ హయాంలో 30 శాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగితే..70 శాతం ప్రైవేటు ఆస్పత్రుల్లో జరిగేవి అని గుర్తు చేసారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది ప్రభుత్వ ఆస్పత్రుల్లో 70 శాతానికి పైగా డెలివరీలు అవుతున్నాయని తెలిపారు.