-తలసరి ఆదాయంలో తెలంగాణకు ప్రథమ స్థానం
-తలసరి ఆదాయంలో ఉమ్మడి రాష్ట్రంలో పదో స్థానం-నేడు మూడో స్థానంలో తెలంగాణ
తెలంగాణ రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాల్లో భాగంగా సభలో ప్రశ్నోత్తరాల సమయంలో అసెంబ్లీలో మంత్రి హరీశ్ రావు సమాధానం ఇచ్చారు. గత తొమ్మిదేండ్లుగా హిమాచల్ ప్రదేశ్ గుజరాత్ తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటక కేరళ ఉత్తరాఖండ్ హర్యానాను దాటి మూడో స్థానంలో ఉందన్నారు. జీఎస్డీపీ 1)రూరల్ సెక్టార్ వ్యవసాయ వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడి ఉంది. 2)(నిర్మాణ రంగం) టీఎస్ ఐపాస్ ద్వారా అత్యంత వేగంగా అనుమతులివ్వడం వల్ల పారిశ్రామిక ఐటీ రంగం అభివృద్ధి. 3) సర్వీస్ సెక్టార్ అభివృద్ధి. 4) అర్భన్ ఎకానమీ అభివృద్ధిపై ఆధారపడి ఉంది. ఈ నాలుగు రంగాల్లో తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందటం వల్ల జీఎస్డీపీ పెరిగింది.
దేశ తలసరి ఆదాయం రూ. 1,72,276లు .. తెలంగాణ తలసరి ఆదాయం రూ. 3,12,398లు ఉందన్నారు. క్యాపిటల్ ఎక్స్ పెండ్ బుల్ దేశం కంటే ఇరవై శాతం ఎక్కువగా తెలంగాణ చేస్తుంది. దేశంలో అతి తక్కువ అప్పులు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ.. కింద నుండి ఐదో స్థానంలో ఉందన్నారు. తెలంగాణకు కేంద్రం నుండి రూ 800 కోట్లు జీఎస్టీ నిధులు బకాయిలు రావాలి. తెలంగాణ జీడీపీ 12.07% .. దేశం యొక్క జీడీపీ 10.5%. జీఎస్డీపీ తెలంగాణ వచ్చిన కొత్తలో రూ. 4,51,580 cr 13,13,391 కోట్లకు పెరిగిందని తెలిపారు. తెలంగాణ వచ్చినప్పుడు తలసరి ఆదాయం రూ.1,12,163లు – నేడు తలసరి ఆదాయం రూ. 3,12,398 లు ఉందని తెలియజేసారు.