వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కుల వృత్తులను ప్రోత్సహించుటకై 1 లక్ష రూపాయల ఆర్థిక సాయం- సిద్దిపేట నియోజకవర్గ స్థాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై నారాయణరావుపేట, చిన్నకోడూరు, సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్ మండలాలలోని 200 మంది లబ్ధిదారులకు రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ..
కుల వృత్తులను కాపాడి వారికి ఆర్థికంగా చేయూత అందించేందుకు బీసీ కుల వృత్తి దారులకు 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం పథకం, బ్యాంకుల ద్వారా షూరిటీ, గ్యారెంటీగా లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో నేరుగా లబ్ధి దారులకు ఒక లక్ష రూపాయల చెక్కుల పంపిణీ, ముఖ్యమంత్రి బీసీ కుల వృత్తి దారులకు చేయూత అందించాలనే ఉద్దేశంతో నాయి బ్రాహ్మణులు, రజకులకు ఫ్రీ కరెంటుని అందజేస్తున్నారని తెలిపారు.
గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ
నేతన్నలకు 50 శాతం సబ్సిడీతో నూలు, వారు నేసిన వస్త్రాలను ప్రభుత్వ కొనుగోలు. చేనేత మిత్ర కార్యక్రమం చేపట్టారు. మత్స్యకారుల కోసం నీటి వనరులలో ఉచిత చేప పిల్లల పంపిణీ. 600 కోట్ల రూపాయలు వ్యయం చేసి మత్స్యకారులకు లూనాలు, మోపెడ్ల పంపిణీ, గీత కార్మికులకు చెట్లు పన్ను మరియు పాత బకాయిల రద్దు, సొసైటీల పునరుద్ధరణ. ఎక్కడ లేని విధంగా సిద్దిపేటలో మోడల్ దోబీ ఘాట్ నిర్మాణం. సిద్దిపేట దోబీఘాట్ స్ఫూర్తితో హైదరాబాద్ లో కూడా ధోబి ఘాట్ నిర్మించుకున్నారని తెలిపారు.
కుమ్మరుల అభివృద్ధి కోసం సిద్దిపేటలో 2 కోట్ల 20 లక్షల రూపాయలతో రాష్ట్రంలోనే తొలిసారిగా ప్లాస్టిక్ రహిత సమాజం నిర్మాణం కోసం మట్టి కుండలు, మట్టి వంట పాత్రలు, మట్టి గ్లాసులు తదితర మట్టి పాత్రల తయారీ కోసం మోడల్ ప్రాజెక్ట్ చేపట్టామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు సిద్దిపేటలో చేపడుతున్న ఈ వినూత్న కార్యక్రమాలను చూసి వారి జిల్లాలలో ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
తెలంగాణ రాకముందు రాష్ట్రంలో మొత్తం 330 రెసిడెన్షియల్ స్కూల్స్ మాత్రమే ఉండగా ప్రస్తుతం 1012 ఏర్పాటు చేసుకున్నామన్నారు. ప్రతి ఒక్క మండలం లో ఒక బీసీ, ఒక ఎస్సీ మరియు ప్రతి నియోజకవర్గానికి ఒక మైనారిటీ రెసిడెన్షియల్ విద్యాలయాలను ఏర్పాటు చేసుకున్నామని అన్నారు.
జిల్లాలో ఇప్పటికీ ఎస్సీ డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీ ఉంది, జిల్లాలో బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారని చెప్పారు. త్వరలోనే బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలను సిద్దిపేటలో ఏర్పాటు చేసుకోబోతున్నామన్నారు. రూపాయి ఖర్చు లేకుండా డిగ్రీ వరకు నాణ్యమైన కార్పొరేట్ విద్యను పేద విద్యార్థులకు అందిస్తున్నాము.ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.