mt_logo

బీజేపీ ధర్నాల పేరుతో డ్రామాలాడుతోంది : మంత్రి గంగుల కమలాకర్

కేంద్రంలో బీజేపీ రైతుల జీవితాలతో ఆడుకుంటుంటే.. రాష్ట్రంలో బీజేపీ ధర్నాల పేరుతో డ్రామాలాడుతుందని మంత్రి గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి కరీంనగర్‌లో పార్టీ నేతలతో కలిసి మంత్రి గంగుల గురువారం మీడియాతో మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం కావాలనే తెలంగాణ రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేయడం లేదని, కానీ రైతులు పండించే ప్రతీ గింజను రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్రవ్యాప్తంగా 6,663 కేంద్రాలను ఏర్పాటు చేసి, 5.15 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొన్నామని వెల్లడించారు. రాష్ట్రం ప్రభుత్వం ఓ వైపు ధాన్యం కొంటుంటే.. బీజేపీ నేతలు ధర్నాల పేరుతో నాటకాలాడుతున్నారని విమర్శించారు. బీజేపీ నేతలు రాష్ట్రంలో కాకుండా ఢిల్లీలో ధర్నా చేసి, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలన్నారు. బీజేపీ నేతలు అబద్ధాలు చెప్పి బతుకుతున్నారని, వారి మాటలను తెలంగాణ రైతులు నమ్మొద్దన్నారు. తాము వడ్లు కొంటున్నామని, బియ్యం కొనాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదని, యాసంగి పంట మొత్తం కేంద్రమే కొనాలని డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *