
నిజామాబాద్: శుక్రవారం ఉదయం 11 గంటలకు నిజామాబాద్ నగరంలోని భూంరెడ్డి కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ‘జాబ్ మేళా’ ను ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు శ్రీ గణేష్ గుప్తా మరియు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రారంభించారు. ఈ నెల నిజామాబాద్ లో ఐటీ హబ్ ను ప్రారంభించనున్న నేపథ్యంలో జాబ్ మేళాను నిర్వహించారు. నేడు భూంరెడ్డి కన్వెన్షన్ సెంటర్ లో విద్యార్థులతో మరియు అభ్యర్థులతో జరిగిన Q & A కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.