mt_logo

కాంగ్రెస్ పార్టీకి చెమట, రక్తం ధారపోసినా, స్థానం లేకుండా పోయింది: నందికంటి శ్రీధర్

భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ సమక్షంలో మేడ్చల్ – మల్కాజిగిరి డీసీసీ  ప్రెసిడెంట్ నందికంటి శ్రీధర్ బీఆర్ఎస్‌లో చేరారు. నందికంటి శ్రీధర్ వెంట బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు కార్యకర్తలు భారీ ఎత్తున చేరారు.  ఈ సందర్భంగా నందికంటి శ్రీధర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి ఎంతగానో కష్టపడి పని చేసినమని అన్నారు.  కాంగ్రెస్ పార్టీలో బీసీలకు స్థానం లేదని అర్థం అయిన తర్వాత భారత రాష్ట్ర సమితిలో చేరేందుకు వచ్చినాము, కాంగ్రెస్ పార్టీకి చెమట, రక్తం ధారపోసినా, మాకు స్థానం లేకుండా పోయిందన్నారు. ఈరోజు బడుగు బలహీన వర్గాలకు మద్దతు ఇస్తున్న అభివృద్ధికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు ఈరోజు బీఆర్ఎస్ వచ్చాం అన్నారు. 

అభ్యర్థి ఎవరైనా బీఆర్ఎస్‌ను గెలిపించుకుంటాం.. 

 మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. నిద్రాహారాలు మాని అయినా సరే మైనంపల్లి హనుమంతరావుని ఓడించి,  మల్కాజ్‌గిరిలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తాను, మేడ్చల్ జిల్లాలో అత్యధిక మెజార్టీతో మల్కాజిగిరి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తాం అన్నారు. అభ్యర్థి ఎవరైనా బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకునే దిశగా పనిచేస్తామన్నారు. మల్కాజ్‌గిరిలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపియడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. 

భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. 

కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అన్యాయం జరిగిన తర్వాత భారత రాష్ట్ర సమితిలో చేరాలన్న పెద్ద నిర్ణయాన్ని తీసుకుని ముందుకు వచ్చిన శ్రీధర్‌కు స్వాగతం తెలిపారు. జీవితమంతా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ఆయనకు అక్కడ అన్యాయం జరగడంతో ఆయన బీఆర్ఎస్‌లో చేరుతున్నారు. గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్‌ను ఎదుర్కొనే సరైనే ఎజెండా లేకుండా ప్రజల కోసం పనిచేసినాం, ఈ పది సంవత్సరాలు ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడ్డాం, మాకు అవకాశం ఇచ్చిన ప్రజల కోసం, వారి సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పని చేసామన్నారు. 

తగిన గౌరవాన్ని కల్పిస్తాం..  

గత పది సంవత్సరాలు హైదరాబాద్ నగరం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చిందో, ఏ విధంగా అభివృద్ధి అయిందో గుర్తించాలని సూచించారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం మరింతగా పనిచేస్తాం, నందికంటి శ్రీధర్‌కు కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరిగింది… భారత రాష్ట్ర సమితిలో ఆయనకు ఆయన రాజకీయ సేవలకు తగిన గౌరవాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్న శ్రీధర్ చెప్పిన మాట నాకు బాగా నచ్చింది.. నేను పార్టీ కోసం అత్యంత నిబద్ధతతో పనిచేసే వ్యక్తిని… అంతే నిబద్దతతో భారత రాష్ట్ర సమితి కోసం కూడా పనిచేస్తాను అని తెలిపారు. 

హై కమాండ్ నాయకులు కేసీఆర్ ఒక్కరే 

నాతోపాటు భారత రాష్ట్ర సమితిలో చేరిన తన నాయకులు, కార్యకర్తలకు కూడా సరైన అవకాశాలు ఇచ్చే బాధ్యతను మీరు తీసుకోవాలని శ్రీధర్ కోరారు. శ్రీధర్ అడిగిన మేరకు ఈరోజు భారత రాష్ట్ర సమితిలో చేరుతున్న ఆయన అనుచరులను కాపాడుకుంటాం. సరైన విధంగా గౌరవించుకుంటామని తెలిపారు. మాకు ఉన్న హై కమాండ్, నాయకులు కేసీఆర్ ఒక్కరు మాత్రమే. ఆయన ఆదేశాలు సూచన మేరకు మాత్రమే పార్టీ పని చేస్తుంది. మాకు ఢిల్లీలో బాసులు లేరని అన్నారు. ఈరోజు చేరిన నందికంటి శ్రీధర్ మరియు కాంగ్రెస్ శ్రేణులు కలిసి పనిచేసి మల్కాజిగిరిని గెలిపించుకుంటారన్న నమ్మకం విశ్వాసం నాకు ఉన్నదని ఆశాభావం వ్యక్తం చేసారు.