mt_logo

కేటీఆర్ ను కలిసిన హ్యూమన్ కాలిక్యులేటర్ భానుప్రకాశ్!!

హైదరాబాద్ కు చెందిన 20 ఏళ్ల నీలకంఠ భాను ప్రకాశ్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మానవ కాలిక్యులేటర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.. ఆగస్ట్ చివరివారంలో లండన్ లో జరిగిన ‘మెంటల్ కాలిక్యులేషన్ వరల్డ్ ఛాంపియన్ షిప్’ లో బంగారు పతకం సాధించి రికార్డు సృష్టించిన భాను ప్రకాశ్ గురువారం ఐటీ శాఖామంత్రి కేటీఆర్ ను కలిశాడు. ఈ సందర్భంగా కేటీఆర్ భాను ప్రకాశ్ ను అభినందించారు.

ఢిల్లీ లోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుండి గణితంలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన భాను ప్రకాశ్ కు చిన్నప్పటినుండే మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. ఆ కారణంగా ఎస్ఐపీ వారి అబాకస్ ప్రోగ్రాంలో తన పేరు నమోదు చేసుకుని గణితంలో తన నైపుణ్యాలను పెంచుకునే దిశగా వెళ్ళాడు. 2013 లో అంతర్జాతీయ అబాకస్ ఛాంపియన్ షిప్, 2011, 2012 ల్లో జాతీయ అబాకస్ ఛాంపియన్ షిప్ లలో విజేతగా నిలిచాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *