mt_logo

ఉండండి మీ అంతు చూస్తా: లగడపాటి

 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిజమౌతున్న తరుణంలో సమైక్యవాదులు సహనాన్ని కోల్పోతున్నారు. బుధవారం ఏపీ భవన్ లో ఎంపీ లగడపాటి రాజగోపాల్ తనదైన శైలిలో మరోసారి తన ఆక్రోశాన్ని చాటుకున్నారు. తనను ప్రశ్నించిన జర్నలిస్టులపై చేయి చేసుకునేందుకు కూడా సిద్ధపడ్డారు. “మాటలు కావు, చేతులకు పని చెప్తానంటూ” కొట్లాటకు దిగాడు. అంతే కాకుండా మీ అంతు చూస్తానంటూ చిందులు తొక్కారు. లగడపాటి ఈ విచిత్ర ప్రవర్తనకు అక్కడున్న విలేఖరులు అవాక్కై తేరుకునేలోపు అక్కడనుండి పరార్ అయ్యాడీ పెద్దమనిషి.

రాష్ట్ర విభజన సరికాదంటూ జీవోఎం కు లేఖ పంపిన లగడపాటి ఆ లేఖలోని వివరాలు వెల్లడించేందుకు ఏపీ భవన్ లో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసాడుర్పాటువాదులంటూ దూషించారు. ఈ విషయమై విలేకరులు లగడపాటిని పలు ప్రశ్నలతో సంధించారు. రాష్ట్రం ఏర్పాటైతే అల్లకల్లోలం ఎందుకవుతుందని వివరించాలని కోరిన విలేకరులపై ఆయన సహనం కోల్పోయి వారిపై విరుచుకు పడ్డారు.

హెచ్ ఎం టీవీ విలేఖరి అసలు మీరు ఎవరి తరఫున మాట్లాడుతున్నారు.? ప్రజల తరఫునా.? లేక పెట్టుబాడిదారుల తరఫునా.? లేక రాజకీయనాయకుల తరఫునా .? అంటూ ప్రశ్నించారు. దానికి సమాధానంగా సహనాన్ని కోల్పోయిన లగడపాటి విషయాలు తెలుసుకోకుండా మూర్ఖంగా అవివేకంగా మాట్లాడకండి అంటూ హెచ్చరించారు. వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలంటూ నమస్తే తెలంగాణ విలేకరి లగడపాటిని డిమాండ్ చేయగా, ఏ మాత్రం పశ్చాత్తాపభావన లేని లగడపాటి ‘ఏంటి ఓపిక పట్టేది, మాటలే కాదు అవసరమైతే చేతులకు కూడా పని చెప్పాల్సి వస్తుంది’ అంటూ విలేకరులను బెదిరించారు.

లగడపాటి బెదిరింపు వ్యాఖ్యలపట్ల అభ్యంతరం తెలిపిన నమస్తే తెలంగాణ విలేకరి రమేష్ హజారి, హెచ్ ఎం టీవీ కరస్పాండెంట్ సాధిఖ్ లను లక్ష్యం గా చేసుకున్న లగడపాటి “ఉండండి మీ అంతు చూస్తానంటూ” తన వాహనంలో అక్కడి నుండి వెళ్ళిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *