కర్ణాటకలో కాంగ్రెస్ అబద్ధపు హామీలు, అసమర్థ పాలనపై కుమారస్వామి సంచలన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్‌లో కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. 5 గ్యారంటీల అమలులో కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ విఫలం అయ్యిందని స్పష్టం చేసారు. కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంలు తెలంగాణకు వెళ్లి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతులకు కరెంటు ఎక్కడ ఇస్తున్నారో కాంగ్రెస్ నేతలు చెప్పాలన్నారు.
కర్ణాటకలో ఏ సబ్‌స్టేషన్‌కు వెళ్లి చూసినా తెలిసిపోతుందని అన్నారు. ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందని వెల్లడించారు. రైతులకు రూ.15 వేలు ఇస్తామని తెలంగాణలో కాంగ్రెస్ హామీ ఇస్తున్నారు, సీఎం కేసీఆర్ ఇప్పటికే ఎకరానికి రూ.10 వేలు ఇస్తున్నారు కదా? అని ప్రశ్నించారు. ఇప్పటికే రూ.73 వేల కోట్లకు పైగా రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో వేశారు, రైతుబంధు పథకాన్ని బీజేపీ కాపీ కొట్టింది అని చెప్పారు. గతంలో కర్ణాటక ఎకరానికి రూ.4 వేలు ఇచ్చేవారు కానీ, కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ.4 వేలు ఇవ్వడం లేదన్నారు.
కాంగ్రెస్ దగాకోరు వైఖరిని, నయవంచనను అందరూ గుర్తించాలని విజ్ఞప్తి చేసారు. రైతులకు సీఎం కేసీఆర్ 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నారు. కర్ణాటకలో 5 గంటలు కరెంటు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కర్ణాటకలో రైతులకు ఇస్తున్నది కేవలం 2 గంటల కరెంటే అని తెలియజేసారు. ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందని హెచ్చరించారు. కర్ణాటకలో గృహలక్ష్మి పథకం సరిగా అమలు కావడం లేదని చెప్పారు. ఉచితంగా 200 యూనిట్ల కరెంటిచ్చే గృహ జ్యోతి పథకం అమలు కావడం లేదు, విద్యుత్ చార్జీలు పెంచిన సామాన్యులను దోపిడీ చేస్తున్నారు. ప్రజలను, పారిశ్రామికవేత్తలను దగా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.
యువ నిధి కింద గ్రాడ్యుయేట్స్ కు రూ.3 వేలు, డిప్లొమా హోల్డర్లకు రూ.1500 ఇస్తామన్నారు. యువ నిధి పథకానికి ఇప్పటికీ అతీగతీ లేదన్నారు. ఇప్పుడేమో 2023-24 లో పాసైన వారికే అని మాట మార్చారని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలన్నీ గారడీలే. కాంగ్రెస్ దగాకోరు వైఖరిని, నయవంచనను ప్రజలందరూ గుర్తించాలని సూచించారు. రాజస్థాన్‌లో రైతు రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇస్తున్నారు. కర్ణాటక రైతు రుణాలు ఎందుకు మాఫీ చేయరో చెప్పాలన్నారు. కర్ణాటక రైతులు రూ.33,700 కోట్లు నష్టపోయారు. కర్ణాటక రైతులను కాంగ్రెస్ సర్కార్ ఎందుకు ఆదుకోవడం లేదని ప్రశ్నించారు.