mt_logo

పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన కేటీఆర్

పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొంటున్న క్రీడాకారులు అందరికీ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు నుంచి ఫ్రాన్స్ లోని పారిస్ లో ఒలంపిక్స్ క్రీడలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో దేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న 117 మంది క్రీడాకారులను దేశ ప్రజలంతా ఉత్సాహపరచాలన్నారు.

2020 జపాన్‌లో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో సాధించిన ఏడు ఒలంపిక్స్ పథకాల రికార్డును దాటి ఈసారి కూడా చరిత్రను సృష్టిస్తారన్న ఆశాభావాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు.

క్రీడాకారులందరూ తమ అత్యుత్తమ ప్రదర్శనతో విజయం సాధిస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసిన కేటీఆర్ వారందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. దేశమంతా ఏకతాటిపైకి వచ్చి క్రీడాకారులు సాధించే విజయాలలో భాగస్వాములుగా అయ్యేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారన్నారు. ప్రతి క్రీడాకారులు తాము పోటీపడుతున్న క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శనతో విజయం సాధించి, దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆశించారు. ప్రపంచ క్రీడా వేదిక పైన భారతదేశం సత్తా చాటాలని, చక్ దే ఇండియా అన్నారు

తెలుగు రాష్ట్రాల నుండి ఒలింపిక్స్‌ క్రీడల్లో పాల్గొంటున్న నికత్ జరీన్, పీవీ సింధు, ఆకుల శ్రీజ, ఎర్రజి జ్యోతి, జ్యోతిక శ్రీ దండి, ఈషా సింగ్, సాత్విక సాయిరాజ్, ధీరజ్ బొమ్మదేవర ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఒలింపిక్స్‌ క్రీడల్లో దేశం తరపున పతాకదారులుగా నిలిచిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు శరత్ కమల్‌తో పాటు బ్యాట్మెంటన్ దిగ్గజం పీవీ సింధు, గగన్ నారంగ్‌లకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.