mt_logo

ఉచిత వై-ఫై సేవలను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్..

నేటినుండి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఉచిత వై-ఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. బుధవారం సాయంత్రం రాష్ట్ర ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ హోటల్ మారియట్ లో ఈ సేవలను ప్రారంభించనున్నారు. హుస్సేన్ సాగర్ పరిసరాల్లోని ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, లుంబినీ పార్కుల చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో ఈ ఉచిత వైఫై సేవలు పొందవచ్చు. 2 ఎంబీపీఎస్ నుండి 20 ఎంబీపీఎస్ వేగంతో ఈ సేవలు వినియోగదారులకు అందుతాయి.

మంత్రి కేటీఆర్ ఈ ఉచిత వై-ఫైతో కేంద్ర ఐటీ శాఖామంత్రి రవిశంకర్ ప్రసాద్ తో పేస్ టైం కాల్ లో సంభాషణ జరుపుతారు. ఈ వీడియో కాల్ తోనే హైదరాబాద్ లో ఉచిత వై-ఫై సేవలు లాంఛనంగా ప్రారంభం కానున్నాయని సమాచారం. ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్ తో కలిసి క్వాడ్ జెన్ కంపెనీ ఈ సేవలను అందించబోతున్నది. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ తో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్, హెచ్ఎండీఏ కమిషనర్, బీఎస్ఎన్ఎల్ సీఎండీ, క్వాడ్ జెన్ చైర్మన్లు, ఇతర అధికారులు పాల్గొననున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *