mt_logo

దేశంమెచ్చే నాయ‌కుడిగా కేటీఆర్ ఎదుగుతారు.. ఆయ‌న ధ్యాసంతా పెట్టుబ‌డుల మీదే..ప్ర‌ముఖ పారిశ్రామికవేత్త క‌న్వ‌ల్ రేఖి ప్ర‌శంస‌

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి రంగంలోకి దిగితే రాష్ట్రానికి పెట్టుబ‌డుల వ‌ర‌ద పారాల్సిందే. ఆయ‌న త‌న బృందంతో విదేశీ ప‌ర్య‌ట‌న చేప‌డితే దిగ్గ‌జ కంపెనీలు రాష్ట్రానికి క్యూ క‌ట్టాల్సిందే. ఆయ‌న ప‌ట్టుద‌ల‌, చాణ‌క్యంతో ఇప్ప‌టికే గూగుల్‌, అమెజాన్‌, ఫాక్స్‌కాన్‌లాంటి ప్ర‌ముఖ కంపెనీలు తెలంగాణ బాట‌ప‌ట్టాయి. వీటితోపాటు ప్ర‌ఖ్యాత కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టాయి. ల‌క్ష‌లాదిమందికి ఉపాధి బాటలు వేశాయి.  అందుకే మంత్రి కేటీఆర్ దేశంలోని నాయ‌కుల‌కే రోల్ మాడ‌ల్‌, ఇండియ‌న్ ఫ్యూచ‌ర్ లీడ‌ర్ అని అంటున్నారు అమెరికాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త కన్వల్‌ రేఖి. మంత్రి కేటీఆర్ ధ్యాస అంతా ఎప్పుడూ పెట్టుబ‌డుల‌పైనే ఉంటుంద‌ని, రాష్ట్ర అభివృద్ధే ల‌క్ష్యంగా ప‌నిచేస్తూ ఉంటార‌ని ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు.

కేటీఆర్ గురించి రేఖి ఏం చెప్పారంటే..

అమెరికాలోని ‘ఇన్వెస్టస్‌ క్యాపిటల్‌ పార్ట్‌నర్స్‌’ ఎండీగా రేఖి ప‌నిచేస్తున్నారు. ఆయ‌న భారతీయ అమెరికన్‌. మంత్రి కేటీఆర్‌ను కొంతకాలంగా తాను ఫాలో అవుతున్న‌ట్టు ట్విట్ట‌ర్ (ఎక్స్‌) వేదిక‌గా ప్ర‌క‌టించారు. కేటీ రామారావు యువ‌కుడు, ఉత్సాహ‌వంత‌మైన నాయ‌కుడు. తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న‌యుడు. నేను ఆయ‌న‌ను ఇండియాలో, అమెరికాలో కొన్నిసార్లు క‌లిశాను. ఆయ‌న దృష్టి ఎప్పుడూ అభివృద్ధిపైనే ఉంటుంది. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబ‌డుల సాధ‌నంకోసం కేటీఆర్ విదేశీ ప‌ర్య‌ట‌న‌లు చేస్తూనే ఉంటారు. తెలంగాణ చాలా చిన్న రాష్ట్రం. దేశ జ‌నాభాలో 2.5శాతం మాత్ర‌మే ఉన్న తెలంగాణ జీడిపీ దేశ జీడిపీలో 5శాతం వాటా క‌లిగి ఉన్న‌ది. ఇదంతా మంత్రి కేటీఆర్ వ‌ల్లే సాధ్యం. ఆయ‌న‌ను ఇత‌ర రాష్ట్రాలు రోల్‌మాడ‌ల్‌గా తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉన్న‌ది. కేటీఆర్ ఏదో ఒక‌రోజు కేంద్రంలో పెద్ద‌స్థాయిలో క‌నిపిస్తారు. భార‌త‌దేశ భ‌విష్య‌త్తును మార్చేందుకు కృషిచేస్తారు. తెలంగాణ‌లో ఫాక్స్‌కాన్ సంస్థ పెట్టుబడుల‌ను విస్త‌రించింది అంటే అది కేటీఆర్ ఘ‌న‌తే. ముఖ్య‌మంత్రి కేసీఆర్ నాయ‌క‌త్వం, మంత్రి కేటీఆర్ ప‌నితీరుతో తెలంగాణ దిన‌దినాభివృద్ధి చెందుతున్న‌ది. అని రేఖి ట్వీట్ చేశారు.