mt_logo

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించిన కేటీఆర్ 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పర్యటించారు. జిల్లాలోని సారంపల్లిలో ఇటీవల వడగండ్ల వానకు నష్టపోయిన పంటలను మరియు సాగునీరందక ఎండిన పంటలను కేటీఆర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా పంటల నష్టంపై రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్య విధానాల వల్ల రైతులు ఆగమైపోతున్నారని కేటీఆర్‌ అన్నారు.

తెలంగాణలో 15 నుంచి 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని.. ఇది కాలం తెచ్చిన కరువు కాదని కాంగ్రెస్‌ తెచ్చిన కరువు అని పేర్కొన్నారు.