mt_logo

ఇది ముమ్మాటికి కాంగ్రెస్ తెచ్చిన కరువు: కేటీఆర్

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో ఎండిన వరి పొలాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించారు. రైతులను పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ చేస్తానన్న రుణమాఫీ చేయలేదు..బ్యాంకుల ద్వారా నోటీసులు ఇప్పిస్తూ, మెడపైన కత్తి పెట్టి రుణాలు కడతారా చస్తారా అన్నట్లు ఉంది అని పేర్కొన్నారు.

ఎండిపోయిన పది పదిహేను లక్షలు ఎకరాలను రాష్ట్రవ్యాప్తంగా మా ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలుస్తున్నాం.. రైతులను చూస్తే నిజంగానే బాధేస్తుంది.. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ముమ్మాటికి కాంగ్రెస్ తెచ్చిన కరువు అని కేటీఆర్ అన్నారు.

మేడిగడ్డ వద్ద కుంగిపోయిన మూడు పిల్లర్లు వద్ద కాఫర్ డామ్ కడితే అయిపోయేది.. ఢిల్లీకి జాతరలు, యాత్రలు తప్పితే రాష్ట్రానికి రేవంత్ చేసిందేమీ లేదు అని విమర్శించారు

కౌలు రైతులు, రైతులకు చేస్తానన్న లబ్ధి చేకూర్చాలి.. రైతులకు ఇస్తానన్న క్వింటాలుకు రూ. 500 బోనస్ వెంటనే ఇవ్వాలి అని డిమాండ్ చేశారు.

రైతులు ధైర్యంగా ఉండండి.. మేం ఉన్నాం.. రైతులు ఆత్మహత్యలు లాంటి తీవ్రమైన చర్యలకు పాల్పడవద్దు అని కేటీఆర్ పిలుపునిచ్చారు.