అపోలోలో చికిత్స పొందుతున్న అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు పరామర్శించారు. బాలరాజు ఆరోగ్య పరిస్థితిని కేటీఆర్ డాక్టర్లతో అడిగి తెలుసుకున్నారు. ప్రజాదరణ ఓర్వలేకనే తమపై దాడులకు తెగబడుతున్నారని కేటీఆర్‌కి తెలిపిన బాలరాజు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉద్యమ కాలంలో ఇలాంటి ఎన్నో దాడులను ఎదుర్కొని తెలంగాణ పోరాడిన నాయకుడు బాలరాజు అని కేటీఆర్ అన్నారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. రాష్ట్ర డిజిపితో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతానని మంత్రి కేటీఆర్ తెలిపారు.