mt_logo

ఓ అన్నగా ఆడబిడ్డ ఆతిథ్యం స్వీకరించిన మంత్రి కేటీఆర్ 

-తొలిసారిగా తన ఇంటికి వచ్చిన కేటీఆర్ కు బట్టలు పెట్టి సత్కరించిన మంత్రి సత్యవతి రాథోడ్

ఓ అన్నగా ఆడబిడ్డ ఆతిధ్యం స్వీకరించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర పురపాలక ఐటీ శాఖ కేటీఆర్. హోదాలు, గౌరవాలకు అతీతంగా ప్రవర్తించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. అటు ఉద్యమకాలంలో, ఇటు తెలంగాణ ఆవిర్భావం తర్వాత కూడా మానుకోట కు వచ్చిన మంత్రి కేటీఆర్, తన పర్యటనల వరకే పరిమితం అయ్యారు. అయితే ఈ సారి మహబూబాబాద్ జిల్లా లో పోడు భూముల పంపిణీ చేయడానికి వచ్చిన కేటీఆర్, తొలిసారిగా కొత్తగా కట్టుకున్న మంత్రి సత్యవతి రాథోడ్ ఇంటికి వచ్చారు. ఆమె ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఇదే సమయంలో తన ఇంటికి వచ్చిన కేటీఆర్ కు సంప్రదాయ పద్ధతిలో బట్టలు పెట్టి మంత్రి సత్యవతి రాథోడ్ సత్కరించారు. ఆమె కానుకను మంత్రి కేటీఆర్ ఆనందంగా స్వీకరించారు. తన ఔదార్యంతో మంత్రి సత్యవతిని మంత్రి కేటీఆర్ సంతోష పెట్టారు. ఈ దృశ్యాన్ని చూసిన వాళ్లంతా ఆనంద పడ్డారు.