mt_logo

అల్లు అర్జున్ అరెస్ట్ రేవంత్ అభద్రతాభావానికి తార్కాణం: కేటీఆర్

ప్రముఖ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్‌పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును, చేసిన అతిని ఖండిస్తున్నాను. జాతీయ అవార్డు గెలుచుకున్న స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ పాలకుల అభద్రతాభావానికి తార్కాణం అని పేర్కొన్నారు.

తొక్కిసలాట బాధితుల పట్ల నాకు పూర్తి సానుభూతి ఉంది, కానీ అసలు తప్పు ఎవరిది? నేరుగా ఆయనకు సంబంధం లేని అంశంలో అల్లు అర్జున్ గారిని సాధారణ నేరస్తుడిలా పరిగణించడం సరైంది కాదు అని అన్నారు.

సంబంధం లేని అంశంలో అల్లు అర్జున్ అరెస్టు చేయడం న్యాయమైతే.. హైడ్రా పేరుతో పేద ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి వారి మరణానికి కారణమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలి అని కేటీఆర్ దుయ్యబట్టారు.