20 జిల్లాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పోలీస్ యాక్ట్ అమలు చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. పోరాడి సాధించుకొని పదేళ్లు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్న తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయి అని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజాస్వామిక తెలంగాణలో మళ్లీ ఎనుకటికాలంలా బూటుకాళ్ల శబ్దాలతో తెలంగాణ తెల్లవారే రోజులొచ్చాయి. ఇందిరమ్మ రాజ్యంలో ప్రశ్నిస్తే కేసులు.. హక్కులను అడిగితే బెదిరింపులు.. పోరాడితే సస్పెన్షన్లు అని ఎద్దేవా చేశారు
ఇది నియంతృత్వ రాజ్యం.. నిర్బంధాన్ని నిర్మిస్తున్న ప్రభుత్వం. పోరాటం తెలంగాణకు కొత్తకాదు.. ఈ మట్టి పొత్తిళ్ళలో పోరాటం ఉన్నది అని అన్నారు.
ఆ సహజత్వాన్ని ఎత్తిపడుతూ నిర్బంధాన్ని ఎదురిస్తాం. ప్రజాస్వామిక తెలంగాణ పునరుద్దరణకై పోరాడుతాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.