బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు నివాసంపైన కాంగ్రెస్ గుండాల దాడిని పిరికిపందల చర్యగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు
గత పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం పగ సాధింపు రాజకీయాలకు, రాజకీయ హింసకు దూరంగా ఉన్నది.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసుల సహాయంతో హింసను ప్రేరేపించేలా ప్రయత్నం చేస్తున్నది అని ధ్వజమెత్తారు.
తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ థర్డ్ రేటెడ్, నీచ రాజకీయాలను గమనిస్తున్నారు, సరైన సమయంలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు. ఒకవైపు రాహుల్ గాంధీ మొహబ్బత్ కా దుకాణ్ అని మాట్లాడుతూ ఉంటే ఆయన పార్టీ తెలంగాణలో నఫ్రత్ కా దుకాణ్ అంటూ హింసను ప్రేరేపిస్తున్నది అని మండిపడ్డారు.
ఇదేనా రాహుల్ గాంధీ వల్లె వేస్తున్న మొహబ్బత్ కా దుకాణ్ రాజ్యాంగ పరిరక్షకుడిని అని ప్రకటించుకున్న రాహుల్ గాంధీ చేస్తున్న రాజ్యాంగ విలువల పరిరక్షణ ఇదేనా? అని కేటిఆర్ ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ దుర్మార్గాలకు రాహుల్ గాంధీ సిగ్గుతో తలదించుకోవాలి అని పేర్కొన్నారు.