ఎమ్మెల్సీ కవితకు ఈడీ, సీబీఐ కేసుల్లో సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. న్యాయం గెలిచింది అని పేర్కొంటూ.. కేటీఆర్ సుప్రీం కోర్టుకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా.. 166 రోజుల పాటు కవితను జైల్లో ఉంచి కూడా ఎలాంటి స్పష్టమైన ఆధారాలు చూపెట్టలేకపోయారని.. ఇది కేవలం ఒక రాజకీయ ప్రేరేపిత కేసే అని సోషల్ మీడియాలో పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నట్లుగానే కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తుంది అని కొందరు గుర్తు చేస్తున్నారు.