mt_logo

మరో చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకోవడంపై కేటీఆర్ ఆవేదన

కాంగ్రెస్ సర్కారు పరిపాలనా వైఫల్యం వల్లే సిరిసిల్లలో మరో చేనేత కార్మికుడు బలయ్యాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి లేక ఉరి వేసుకుని పల్లె యాదగిరి అనే కార్మికుడు ఆత్మహత్య చేసుకోవడంపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఇది ఆత్మహత్య కాదని, ముమ్మాటికి ప్రభుత్వం చేసిన హత్యేనని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో చేనేత రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ హయాంలో చేనేతకు అందించిన చేయూతను అర్ధాంతరంగా నిలిపివేయడంతోనే ఈ రంగంలో మరణమృదంగం మోగుతోందని ధ్వజమెత్తారు. ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.