mt_logo

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు న్యాయం చేస్తారన్న నమ్మకం లేదు: కేటీఆర్

కేంద్ర ప్రభుత్వం ఇవ్వాళ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. ఐతే ఈ బడ్జెట్‌పై తమకు ఎలాంటి ఆసక్తి లేదని కేటీఆర్ అన్నారు. సాధారణంగా కేంద్ర బడ్జెట్ అంటే తమ రాష్ట్రానికి నిధుల కేటాయింపులు ఎలా ఉంటాయోనన్న ఆసక్తి ఉంటుంది. కానీ మోడీ సర్కార్ గత పదేళ్లుగా తెలంగాణపై సవితి తల్లి ప్రేమనే చూపుతోందని గుర్తు చేశారు.

తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడి కేంద్రం నుంచి సాయం అందాల్సినప్పటికీ మోడీ ఎప్పుడు అది పట్టించుకోలేదని కేటీఆర్ అన్నారు. ప్రతి బడ్జెట్‌లో రాష్ట్రానికి మేలు చేసే కేటాయింపులు జరపాలని కోరినప్పటికీ పట్టించుకోలేదని విచారం వ్యక్తం చేశారు. ఈ సారి బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపులు ఎలా ఉంటాయని నన్ను ఒక జర్నలిస్ట్ మిత్రుడు అడిగాడు. దానికి నా సమాధానం ఈ సారి కూడా కేంద్ర బడ్జెట్‌లో అదే పరిస్థితి ఉంటుందని మళ్లీ కేటాయింపులు గుండాసున్నానే అని గట్టి నమ్మకం ఉందన్నారు.

ఐతే ఈసారి బీజేపీకి తెలంగాణలో 8 ఎంపీ సీట్లు వచ్చాయి. కనుక ఇక్కడి ప్రజలు మోడీ మీద బీజేపీ మీద అభివృద్ధి చేస్తారని నమ్మకం పెట్టుకున్నారు. కేంద్రంలో గెలిచే ప్రభుత్వానికి ఓట్లు వేస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుందని భావించారు. అందుకే బీజేపీకి 8 సీట్లు ఇచ్చారు. మరి ఈ ప్రాంత ప్రజల కోసం మన బీజేపీ ఎంపీలు మోడీతో మాట్లాడి ఏం మేలు చేసేలా చేస్తారో వేచి చూడాలి అని అన్నారు.

నాకు తెలిసి మోడీతో మన ప్రాంత ప్రయోజనాల కోసం మాట్లాడే సత్తా మన బీజేపీ ఎంపీలకు లేదు. కనుక ఎప్పటి లాగే తెలంగాణకు ఈ బడ్జెట్‌లోను గుండుసున్నానే అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.