రాష్ట్రవ్యాప్తంగా మాజీ సర్పంచులు అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. పెండింగ్ బిల్లులు ఇవ్వాలని ఏడాది కాలంగా అడిగినా ఇవ్వకపోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు.
రాష్ట్రంలో నిత్యం అరెస్టుల పర్వమే కొనసాగుతోంది. పోలీసులతో సమస్యలను అణగదొక్కాలని చూస్తుంది ప్రభుత్వం. రాష్ట్రంలోని సమస్యలు గాలికి వదిలి ముఖ్యమంత్రి, మంత్రులు ఊరేగుతున్నారు అని దుయ్యబట్టారు.
సర్పంచుల కుటుంబాలు రోడ్డున పడే దాకా ప్రభుత్వం స్పందించదా? శాంతియుత నిరసనకు పిలుపునిచ్చిన సర్పంచులను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని ప్రశ్నించారు.
పల్లె ప్రగతి పేరిట మేము చేపట్టిన కార్యక్రమాననికి తూట్లు పొడిచి నిధులు విడుదల చేయకుండా ఆపుతున్నారు. అరెస్ట్ చేసిన సర్పంచ్‌లను వెంటనే విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.