గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనపై స్పందిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ గారు తీసుకొచ్చిన 95 శాతం లోకల్ రిజర్వేషన్లు తుంగలో తొక్కే విధంగా ప్రభుత్వం వ్యవహారం ఉంది. తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాకుండా.. వికీపీడియా ప్రామాణికం అంటుండటం బాధాకారం అని పేర్కొన్నారు.
గత నాలుగు రోజులుగా ఎండ, వానా అనక ఆందోళన చేస్తున్న గ్రూప్-1 అభ్యర్థుల విషయంలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు శోచనీయం, బాధాకారం. ఆందోళన చేస్తున్న అభ్యర్థుల్లో చాలా మంది రేపు ఉన్నతాధికారులు కాబోతున్నారు. వాళ్లను గొడ్ల మాదిరిగా లాక్కెళ్లుతూ కొడుతుండటం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏ కారణం చేత మేము మొండిగా ఉన్నామో అన్నది అభ్యర్థులను పిలిచి కనీసం వాళ్లకు వివరణ ఇవ్వకపోవటం శోచనీయం, దారుణం. ఏ రాహుల్ గాంధీ, ఏ రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు అశోక్ నగర్‌కు వెళ్లి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ పొంకనాలు కొట్టి గెలిచారు.. కానీ ఇప్పుడు వాళ్ల మాటలు కూడా ఆలకించని పరిస్థితి చూసి తెలంగాణ యువత క్షోభిస్తోంది అని దుయ్యబట్టారు.
ఉన్నతాధికారులు కావాల్సిన యువతతోనే ఇలా వ్యవహరిస్తున్నారంటే.. మిగతా యువతతో ఎలా వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా స్పందించి వారితో మాట్లాడాలి అని కేటీఆర్ సూచించారు.
సుప్రీంకోర్టులో ఈ అంశానికి సంబంధించి సోమవారం విచారణ ఉంది. మా నాయకులు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు విద్యార్థులతో వెళ్లారు..ప్రభుత్వం ఇంత మొండిగా, మూర్ఖంగా వ్యవహరించకుండా అభ్యర్థులతో చర్చలు జరపాలి. సహేతుకమైన కారణాలు చెప్పాలి అని అన్నారు.
లేదంటే వాళ్లు డిమాండ్ చేస్తున్నట్లుగా ఎగ్జామ్స్‌ను పోస్ట్‌పోన్ చేయాలి.. వాళ్లు ఊరికే వాయిదా వేయమని కోరటం లేదు. మధ్యప్రదేశ్‌లో ఇలాగే జరిగితే కోర్టు తీర్పు తర్వాత మళ్లీ పరీక్ష నిర్వహించే పరిస్థితి వచ్చింది అని అన్నారు.
మా నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, దాసోజు శ్రావణ్ గారిని, ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారిని అరెస్ట్ చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా.. ప్రజా పాలన అంటూ పొంకనాలు కొట్టిన రేవంత్ రెడ్డి ఎందుకు ఈ నిరంకుశ నిర్భంధాలు? అని ప్రశ్నించారు.
ఎందుకు చర్చలు జరిపేందుకు భయపడుతున్నావ్. ఎందుకు నాయకులను అరెస్ట్ చేసి గొంతునొక్కే ప్రయత్నాలు చేస్తున్నావ్.. నీ ప్రభుత్వం పడిపోతదని బాధపడుతున్న నీ దోస్త్ బండి సంజయ్‌ని మాత్రం సీఆర్పీఎఫ్ బలగాలతో ఆయనను అక్కడి పంపుతావ్. నేను అక్కడికి వెళ్తా అన్నప్పటికీ పోలీసులను మొహరించావ్. మా నాయకులను అరెస్ట్ చేస్తున్నావ్ అని దుయ్యబట్టారు.
ఇకనైనా సిగ్గు తెచ్చుకొని ప్రభుత్వం అభ్యర్థులతో చర్చలు జరపాలి. వాళ్ల వాదన విని ఎగ్జామ్స్ వాయిదా వేయాలి.. కొన్ని రోజులు వాయిదా వేస్తే కొంపలు మునిగిపోవు. శిఖండి రాజకీయాల్లో భాగంగా బండి సంజయ్‌ను ముందు పెట్టి చర్చలు అంటూ డ్రామా చేస్తున్నారు. బండి సంజయ్ ఏమన్న చదువుకున్నాడా? ఆయన పరీక్ష రాసేది ఉందా? బండి సంజయ్ వాళ్ల ఊదు కాలదు. ఆయన పేపర్ లీకులు చేయమంటే చేస్తాడు అని మండిపడ్డారు.
ఆయనతో చర్చలు జరపటం కాదు. 10 మంది విద్యార్థులను పిలిచి చర్చలు జరపాలి. ఎవరితో చర్చలు జరపాలన్న విచక్షణ ప్రభుత్వానికి ఉండాలి. నిరసన తెలుపుతున్న అభ్యర్థులు అన్ని పార్టీ ఆఫీసులకు వెళ్తున్నారు. వారిని సచివాలయానికి పిలిచి సహేతుకమైన చర్చలు చేయండి. వాళ్ల వాదనలతో సహేతుక ఉందంటే వెంటనే పరీక్షలు వాయిదా వేయండి. అందులో బేషజాలకు పోవాల్సిన అవసరం లేదు అని సలహా ఇచ్చారు.
[4:54 pm, 19/10/2024] Mythreya Kodakandla: పత్రికా ప్రకటన
వానాకాలం రైతు భరోసా ను ఎగగొట్టటం రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేయటమే.
వర్షాకాలానికి రైతు భరోసా పోయినట్లే అని తుమ్మల చేసిన ప్రకటనపై కేటీఆర్ ఆగ్రహం.