mt_logo

నిర్మాణం పూర్తైనా గోపన్‌పల్లి ఫ్లైఓవర్ ప్రారంభించకపోవటంపై కేటీఆర్ ఆగ్రహం

గోపన్‌పల్లి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తైన ప్రారంభించకపోవటంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంకు ఢిల్లీకి చక్కర్లు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టు తిరగటం ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదా? అని ప్రశ్నించారు.

వెంటనే గోపన్‌పల్లి ఫ్లైఓవర్‌ను ప్రారంభించాలి. లేదంటే ప్రజలే ప్రారంభించే పరిస్థితి వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు. హైదరాబాద్‌లోని గోపన్‌పల్లి ఫ్లైఓవర్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిర్మాణం పూర్తి చేసింది అని తెలిపారు.

ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే నల్లగండ్ల, గోపన్‌పల్లి, తెల్లాపూర్, చందానగర్ వాసులకు ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయి.. అందుకోసం బీఆర్ఎస్ ప్రభుత్వం వేగంగా ఈ ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని పూర్తి చేసింది అని కేటీఆర్ పేర్కొన్నారు.

గోపన్‌పల్లి ఫ్లైఓవర్‌ను కేవలం ప్రారంభించాల్సి ఉంది. కానీ ఇప్పటికీ ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభించకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ప్రజల సమస్యలపై అవగాహన లేని అసమర్థ ప్రభుత్వం, నాయకత్వం ఉన్నప్పుడే ఇలాంటి పరిస్థితి వస్తుంది అని దుయ్యబట్టారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యల కన్నా కూడా వ్యక్తిగత ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఇస్తుంది అని కేటీఆర్ విమర్శించారు.. వెంటనే గోపన్‌పల్లి ఫ్లైఓవర్‌ను ప్రారంభించాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు.