mt_logo

2023-24లో ఎఫ్‌డీఐల్లో తెలంగాణ 130% వృద్ధి సాధించింది: కేటీఆర్

విదేశీ సంస్థాగత పెట్టుబడుల (FDI) విషయంలో తెలంగాణ సాధించిన వృద్ధి గణాంకాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

2023-2024 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌డీఐలు దేశంలో భారీగా తగ్గినప్పటికీ తెలంగాణ వంద శాతానికి మించి పెట్టుబడులను సాధించిందన్నారు. ఇందుకు సంబంధించి బిజినెస్ లైన్ పేపర్ వచ్చిన కథనాన్ని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

2024 సంవత్సరంలో దేశానికి ఎఫ్‌డీఐల నిధులు తగ్గాయి. కానీ గుజరాత్, తమిళనాడు, తెలంగాణ మాత్రమే గత ఏడాది కంటే ఎక్కువ పెట్టుబడులను తీసుకురావటంలో సక్సెస్ అయ్యాయన్నారు.

2023 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 2024 ఆర్థిక సంవత్సరంలో గుజరాత్ 55 శాతం, తమిళనాడు 12 శాతం ఎక్కువ పెట్టుబడులను సాధించాయని గుర్తు చేశారు. మిగతా చాలా అన్ని రాష్ట్రాల్లో ఎఫ్‌డీఐ పెట్టుబడులు తగ్గాయి. కానీ తెలంగాణ మాత్రం.. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఎఫ్‌డీఐల్లో 130 శాతం వృద్ధిని సాధించిందన్నారు.

అమెజాన్ సంస్థ వెబ్ సేవల కోసం రూ. 36,300 కోట్లు, మైక్రోసాప్ట్ సంస్థ రూ. 16,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టటం కారణంగానే ఇది సాధ్యమైందని కేటీఆర్ చెప్పారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలోనే ఈ పెట్టుబడులు పెట్టేందుకు ఆయా కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయన్నారు. ఈ ఏడాది ఆ పనులు కార్యరూపం దాల్చడంతో ఎఫ్‌డీఐల విషయంలో భారీ వృద్ధి నమోదైందన్నారు.